Advertisementt

చంద్రిక అందర్నీ అలరిస్తుందట!

Fri 25th Sep 2015 08:10 AM
chandrika movie,sreemukhi,sajidh khureshi,yogesh  చంద్రిక అందర్నీ అలరిస్తుందట!
చంద్రిక అందర్నీ అలరిస్తుందట!
Advertisement
Ads by CJ

ఫ్లయింగ్ వీల్స్ పతాకంపై వి.ఆశ నిర్మాణ సారధ్యంలో రూపొందిన వైవిధ్యమైన హారర్ చిత్రం చంద్రిక. సాజిద్ ఖురేషి కథ-స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ చిత్రానికి యోగేష్ దర్శకుడు. ఇవాళ (సెప్టెంబర్ 25) చంద్రిక ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని థియేటర్లలో చిత్రానికి మంచి స్పందన లభిస్తుండడంతో చిత్ర కథానాయికలలో ఒకరైన శ్రీముఖి మీడియాతో తన సంతోషాన్ని పంచుకొన్నారు. ఈ సందర్భంగా..

శ్రీముఖి మాట్లాడుతూ... ఇప్పటివరకు జులాయి, ప్రేమ ఇష్క్ కాదల్.. వంటి చిత్రాల్లో నటించిన నాకు ఈ చిత్రంలోనటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించే అవకాశం లభించడం సంతోషంగా ఉంది. చిత్రీకరణ కోసం చాలా కష్టపడ్డాం. మా కెమెరామెన్ రాజేందర్ ఈ చిత్రంలో నన్ను చాలా అందంగా చూపించారు. యోగేష్ దర్శకత్వ ప్రతిభ, సాజిద్ ఖురేషిగారు అందించిన కథ-స్క్రీన్ ప్లే చంద్రిక చిత్రానికి మెయిన్ హైలైట్స్ గా నిలిచాయి. నిన్న ఈ సినిమా కన్నడలో విడుదలై.. మంచి టాక్ సొంతం చేసుకొంది. తెలుగు ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.. అని అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ