Advertisementt

కీచక ఆడియో విశేషాలు!

Fri 25th Sep 2015 06:25 AM
keechaka audio launch,yamini bhaskar,kishore parvathareddy  కీచక ఆడియో విశేషాలు!
కీచక ఆడియో విశేషాలు!
Advertisement
Ads by CJ

యామినీ భాస్కర్, జ్వాలా కోటి, రఘుబాబు, నాయుడు, వినోద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కీచక. శ్రీ గౌతమి టాకీస్ పతాకంపై ఎన్.వి.బి.చౌదరి దర్శకత్వంలో కిషోర్ పర్వత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జోశ్యభట్ల సంగీతం అందించిన  ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ పాల్గొని ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ఎన్.వి.బి.చౌదరిగారు నాకు చాలా కాలంగా తెలుసు. రామానాయుడు స్టూడియోలో మాస్టర్ డిగ్రీ చేశారు. నేను కూడా ఆయన దగ్గర చిన్న చిన్న డౌట్స్ ను క్లియర్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఆయనతో మంచి పరిచయం ఉంది. ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలి. యూనిట్ కి మంచి పేరు రావాలి. ట్రైలర్, సాంగ్స్ చాలా బావున్నాయి.. అన్నారు.

దర్శకుడు ఎన్.వి.బి.చౌదరి మాట్లాడుతూ.. నాగపూర్ లో జరిగిన నిజఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాను. నిర్మాత కిషోర్ గారు సపోర్ట్ మరచిపోలేను. జోశ్యభట్ల మంచి సంగీతాన్నందించారు.  పెద్దోడు- చిన్నోడు, ఆదిత్య 369వంటి చిత్రాలు అందించిన శ్రీదేవి మూవీస్ సంస్థ పార్ట్నర్, సీనియర్ నిర్మాత MV రావు, రచయిత వెన్నెలకంటి కీచక చిత్ర అనువాద హక్కులు పొంది అసురన్ అనే పేరుతో తమిళంలో రిలీజ్ చేయనున్నారు. చెన్నైలో డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. జోశ్యభట్ల మంచి సంగీతాన్నందించారు. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది.. అన్నారు.

నిర్మాత కిషోర్ పర్వతరెడ్డి మాట్లాడుతూ.. మన సమాజంలో జరిగిన ఓ చెడు ఘటనపై తీసిన మూవీ. మహిళను చైతన్యపరిచే సినిమా. దర్శకుడు సినిమాని చక్కగా తెరకెక్కించారు. జోశ్యభట్ల మంచి సంగీతాన్ని అందించారు. సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. మేం చేసిన డిఫరెంట్ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం.. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ జోశ్యభట్ల మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్.. అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి గొరేటి వెంకన్న పాల్గొని యూనిట్ ను అభినందించారు.

ఈ చిత్రానికి కెమెరా: కమలాకర్, మాటలు: రాంప్రసాద్ యాదవ్, నిర్మాత: కిషోర్ పర్వతరెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.వి.బి.చౌదరి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ