మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా వస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కాని ఆమె బుల్లి తెర యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. కాని ఇప్పుడు నిహారిక హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. ప్రముఖ న్యూస్ ఛానల్ TV9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ నిర్మాత గా రామరాజు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో యంగ్ హీరో నాగ శౌర్య సరసన నిహారిక హీరోయిన్ గా నటిస్తుంది. మల్లెల తీరంలో, సిరిమల్లె పువ్వు వంటి మంచి ప్రేమ కథా చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రామరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. TV9 తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నందుకు మధుర శ్రీధర్ రెడ్డి చాలా సంతోషంగా ఉన్నాడట.TV9 వంటి ప్రముఖ సంస్థ చిత్ర నిర్మాణం లోకి అడుగు పెట్టడం మన తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి పరిణామం అని ఆయన భావిస్తున్నాడు. ఈ చిత్రానికి A. అభినయ్, డా. కృష్ణ భట్ట సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.