Advertisementt

పులి సినిమా ఆడియో విశేషాలు!

Thu 24th Sep 2015 08:58 AM
puli movie,vijay,sridevi,shobarani,devisriprasad  పులి సినిమా ఆడియో విశేషాలు!
పులి సినిమా ఆడియో విశేషాలు!
Advertisement
Ads by CJ

విజయ్, శ్రీదేవి, శ్రుతిహాసన్, హన్సిక ప్రధాన పాత్రల్లో చింబు దేవన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తమిళ  చిత్రం పులి. ఈ చిత్రాన్ని ఎస్‌.వి.ఆర్‌. మీడియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై శోభారాణి తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొరటాల శివ బిగ్ సీడీను లాంచ్ చేసారు. నిర్మాత సి.కళ్యాణ్ ఆడియో సీడీలను విడుదల చేసారు. ఈ సందర్భంగా..

కొరటాల శివ మాట్లాడుతూ.. చిత్ర ప్రమోషనల్ సాంగ్ చాలా బావుంది. ఆడియన్స్ కు బాగా రీచ్ అవుతుంది. నా తదుపరి చిత్రానికి కూడా ఇలా ఓ ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేసుకుంటాను. ఇదొక ఫాంటసీ చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. సినిమా విజువల్ వండర్ అవుతుంది. సినిమాలో అన్ని పాటలు విన్నాను. దేవిశ్రీప్రసాద్ కు బెస్ట్ ఆల్బం అవుతుంది. సినిమా ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది. 

సి.కళ్యాన్ మాట్లాడుతూ.. శోభారాణి గారు ఫ్యామిలీ సపోర్ట్ తో ఎన్నో అధ్బుతమైన చిత్రాలను నిర్మిస్తున్నారు. పులి చాలా థ్రిల్లింగ్ గా ఉండే చిత్రం. సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా మంచి హిట్ సాధించి శోభారాణి గారు మరిన్ని చిత్రాలను నిర్మించాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. దేవిశ్రీప్రసాద్ ఫోన్ చేసి పిలిచిన వెంటనే నేను ఆడియో ఫంక్షన్ కి వచ్చాను. ఆర్య సినిమా నుండి దేవితో మంచి రిలేషన్ ఉంది. ఎస్.వి.ఆర్ మీడియా వారు పులి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విజయ్ నటించిన చిత్రాలు తెలుగులో మంచి సక్సెస్ ను సాధించాయి. ఈ సినిమా కూడా ఆ కోవలోకే రావాలని కోరుకుంటున్నాను. బాహుబలి సినిమా నుండి తెలుగులో రిలీజ్ అయిన చిత్రాలన్నీ సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అయ్యి మంచి లాభాలు రావాలి.. అని చెప్పారు.

శోభారాణి మాట్లాడుతూ.. తుపాకీ చిత్రం తరువాత విజయ్ నటించిన పులి చిత్రాన్ని అనువదిస్తున్నాం. ఇదొక ఫాంటసీ చిత్రం. 2600 సి.జి. షాట్స్ ఈ సినిమాలో ఉంటాయి. చాలా లాంగ్ గ్యాప్ తరువాత శ్రీదేవి గారు సౌత్ ఇండియా లో నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో ఆవిడే స్పెషల్ ఎట్రాక్షన్. దేవిశ్రీప్రసాద్ గారు మంచి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో మేము రిలీజ్ చేస్తున్నదుకు చాలా సంతోషంగా ఉంది.. అని చెప్పారు.

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలకు పని చేసే అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. జెన్యూన్ గా భారీ ఎత్తున తెరకెక్కించిన చిత్రమిది. టెక్నీషియన్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి పని చేసారు. ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలనుకున్నాం. కాని స్టార్స్ అందరి డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వలన కుదరలేదు. నేను నిర్మాతను దృష్టిలో పెట్టుకొనే సినిమా చేస్తాను. ఓ సినిమాను నిర్మించడం ఎంత ముఖ్యమో ప్రమోట్ చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రమోట్ చేయడాన్ని నేను భాద్యతగా తీసుకుంటాను. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతకు లాభాలు రావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రామజోగయ్య శాస్త్రి, టి.ప్రసన్న కుమార్, బి.ఏ.రాజు తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ