కార్తీక్ జయరామ్, కామ్న జెత్మలాని, శ్రీముఖి హీరోహీరోయిన్లుగా యోగేష్ మునిసిద్దప్ప దర్శకత్వంలో ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్న చిత్రం చంద్రిక. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా..
కామ్న జెత్మలాని మాట్లాడుతూ.. ఇదొక హారర్, థ్రిల్లర్ మూవీ. సినిమాలో రొమాన్స్, కామెడీ, పాటలు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సబ్జెక్టు ఇది. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రంలో చంద్రిక అనే టైటిల్ రోల్ పోషిస్తున్నాను. తనొక క్లాసికల్ డాన్సర్. ఒక విలేజ్ లో చిన్నపిల్లలకు డాన్సు నేర్పిస్తుంటుంది. తన లైఫ్ లోకి హీరో వచ్చాక ఏం జరిగింది..? తన లైఫ్ ఎలా టర్న్ అయిందనే అంశాలతో సినిమా నడుస్తుంటుంది. మొదటిసారి ఈ ప్రొడక్షన్ లో పనిచేస్తున్నాను. ప్రొడ్యూసర్ గారు ప్రతి ఫ్రేం, ప్రతి షాట్ బాగా వచ్చేలా కేర్ తీసుకున్నారు. డైరెక్టర్ యోగేష్ కూల్ అండ్ కామ్ పర్సన్. తనకి మొదటి సినిమా అయినా బాగా డైరెక్ట్ చేసాడు. నా కో యాక్టర్ కార్తిక్ కన్నడలో ఫేమస్ స్టార్. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. మంచి టాలెంట్ ఉన్న మనిషి. శ్రీముఖి నాకు ఎలాంటి సీన్స్ లేవు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను.. అని చెప్పారు.
శ్రీముఖి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. కన్నడలో ఈ నెల 24 న విడుదల చేసి తెలుగులో 25న రిలీజ్ చేయనున్నాం. మొదట ఈ చిత్రానికి సంబంధించిన చిన్న ట్రైలర్ వెర్షన్ షూట్ చేసి యూట్యూబ్ పెట్టి మంచి అప్లాజ్ వస్తే సినిమా చేయాలనుకున్నాం. మేము అనుకున్నట్లుగానే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు నేను ప్రేమ ఇష్క్ కాదల్, జులాయి వంటి సినిమాల్లో నటించాను. కాని పూర్తి స్థాయి హీరోయిన్ గా ఈ చిత్రంలో కనిపిస్తాను. సినిమాలో ఇంటర్వెల్ సీన్ హైలైట్ గా నిలుస్తుంది. మొత్తం ఐదు పాటలున్నాయి. డైరెక్టర్ యోగేష్ గారు మొదటి సినిమానే హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. నిర్మాత గారు ప్రొడక్షన్ లో చాలా కేర్ తీసుకున్నారు.. అని చెప్పారు.
గిరీష్ కర్నాడ్, ఎల్.బి.శ్రీరాం, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్ తదితయి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.రాజేంద్రబాబు, సాహిత్యం: వనమాలి, కరుణాకర్ అడిగర్ల, సంగీతం: గున్వంత్‌సేన్, కథ-స్క్రీన్‌ప్లే: సాజిద్ ఖురేషి, నిర్మాత: శ్రీమతి వి.ఆశ, దర్శకత్వం: యోగేష్ మునిసిద్దప్ప!!