Advertisementt

సుప్రీం సినిమా ప్రారంభం!

Wed 23rd Sep 2015 05:39 AM
supreme movie,dil raju,anil ravipudi,sai dharam tej  సుప్రీం సినిమా ప్రారంభం!
సుప్రీం సినిమా ప్రారంభం!
Advertisement
Ads by CJ

సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం సుప్రీం. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక బుధవారం హైదరాబాద్ లోని జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, కళ్యాణ్ రామ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో సాయి ధరమ్ తేజ్ ను ఇంట్రడ్యూస్ చేసాం. మా బ్యానర్ లో తెరకెక్కించిన సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంతో తను మంచి స్థాయికి ఎదుగుతాడు. సుప్రీం సినిమాతో తేజు పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. పటాస్ మూవీ దగ్గర నుండి అనిల్ తో నేను ట్రావెల్ చేస్తున్నాను. మా ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా షూటింగ్ అమెరికాలో చేస్తున్న సమయంలో తేజు కి అనిల్ దగ్గర స్టొరీ లైన్ ఉంది వింటావా అని అడిగాను. తను ఇండియా వచ్చిన వెంటనే కథ విని ఎగ్జైట్ అయ్యి ఎలా అయినా ఈ సినిమా చేద్దాం సర్ అని చెప్పాడు. తేజు మా బ్యానర్ లో చేస్తున్న మూడవ చిత్రమిది. పవన్ కళ్యాణ్ తన మూడవ సినిమా సుస్వాగతం తో ఎలా పెద్ద హీరో అయ్యాడో, ప్రభాస్ తన మూడవ చిత్రం వర్షంతో ఎంత పెద్ద స్టార్ అయ్యాడో, తేజు కూడా తన మూడవ సినిమా సుప్రీం తో అంత పెద్ద స్టార్ అవ్వాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు. 

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. పటాస్ మూవీ ఫస్ట్ కాపీ చూసిన దగ్గర నుండి దిల్ రాజు గారితో రిలేషన్ స్టార్ట్ అయింది. సుప్రీం మంచి యాక్షన్ ఎంటర్టైనింగ్ మూవీ. దిల్ రాజు గారి స్టైల్ లో ఫీల్ గుడ్ లేయర్ కూడా ఉంటుంది. సినిమాలో తేజు ఓ క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తాడు. అక్టోబర్ 5 నుండి నవంబర్ 15 వరకు మొదటి షెడ్యూల్, డిసెంబర్ నుండి జనవరి వరకు రెండో షెడ్యూల్ నిర్వహించనున్నాం. ఫిబ్రవరి లో సాంగ్స్ షూట్ చేసి మార్చి నెలలో సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం.. అని చెప్పారు.

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. దిల్ రాజు గారితో నాకు స్పెషల్ బాండ్ ఉంది. పిలా నువ్వులేని జీవితం సినిమాకు ముందు నుండే ఆయనతో పరిచయం ఉంది. ఆయన ఎప్పుడు కథ తీసుకువచ్చి సినిమా చేయమన్నా నేను రెడీగా ఉంటాను. ఈ సినిమా కథ విన్న వెంటనే ఎలా అయినా సినిమా చేయాలనే స్వార్ధం కలిగింది. నాకు స్టొరీ అంత బాగా నచ్చింది. అనిల్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడే నాకు సినిమా చూపించేశారు. సాయి కార్తిక్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుంది.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో శిరీష్, శ్రీనివాసరెడ్డి, ప్రభాస్ శ్రీను, సాయి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి మ్యూజిక్: సాయి కార్తీక్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సాయి శ్రీరాం, ఎడిటర్: ఎమ్ ఆర్ వర్మ, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, కో రైటర్: ఎస్ కృష్ణ, చీఫ్ కో డైరెక్టర్: సత్యం బెల్లంకొండ, కో డైరెక్టర్స్: ఎస్ కృష్ణ, మహేష్ ఆలంశెట్టి, అసోసియేట్ డైరెక్టర్: లక్ష్మినాయుడు పి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: శ్రీనివాసరావు పి, వెంకటేశ్వరరావు పి, కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: అనిల్ రావిపూడి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ