Advertisementt

బ్రూస్ లీ సినిమా రిలీజ్ డేట్ ఖరారు!

Wed 23rd Sep 2015 05:27 AM
brucelee movie,ram charan,sreenuvaitla,danayya  బ్రూస్ లీ సినిమా రిలీజ్ డేట్ ఖరారు!
బ్రూస్ లీ సినిమా రిలీజ్ డేట్ ఖరారు!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్ర విషాలు తెలిపేందుకు మంగళవారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా..

దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. ఇదొక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనింగ్ చిత్రం. యాక్షన్, కామెడీలతో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది. చాలా లావిష్ గా సినిమా ఉంటుంది. ఇప్పటివరకు నేను ఒక ఫార్మాట్ లోనే సినిమాలు చేసేవాడిని. మొదటిసారి కొత్త ఫార్మాట్ లో సినిమా చేస్తున్నాను. కాని నా నుండి ఆశించే ఎంటర్టైన్మెంట్ మాత్రం సినిమాలో ఖచ్చితంగా ఉంటుంది. మొదటిసారి రామ్ చరణ్ పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్. తను బ్రూస్ లీ కి పెద్ద అభిమాని. అందుకే సినిమాకు బ్రూస్ లీ అనే టైటిల్ పెట్టాం. సాధారణ వ్యక్తికి ఓ సమస్య వస్తే దాన్ని ఎలా ఎదిరించి నిలిచాడనేదే ఈ చిత్ర కథ. ది ఫైటర్ అనే కాప్షన్ పెట్టడానికి కారణం అదే. మొదట ఈ సినిమాకు రీ సౌండ్, బ్రూస్ లీ ఇలా చాలా టైటిల్స్ అనుకున్నాం. ఫైనల్ గా బ్రూస్ లీ కన్ఫర్మ్ చేసాం. మేము అనుకున్న సమయానికి సినిమా పూర్తి కావడానికి ప్రతి ఒక్కరు ఎంతగానో సహకరించారు. దానయ్య గారి లాంటి అనుభవం ఉన్న ప్రొడ్యూసర్ మా సినిమాకు లేకపోతే ఇంత తక్కువ సమయంలో సినిమా చేయలేకపోయేవాడ్ని. ఈ చిత్రంలో చిరంజీవి గారు కామిక్ చేస్తున్నారు. ఆయన పాత్ర చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఆయనకు స్టొరీ వినిపించగానే వెంటనే నటించడానికి ఓకే చెప్పారు. ఆయనను దృష్టిలో పెట్టుకొనే ఆ క్యారెక్టర్ డిజైన్ చేసాను. ఈ నెల చివరి వారంలో చిరంజీవి గారి షూటింగ్ లో పాల్గొంటారు. ఈ సినిమా ఆయన 150వ సినిమాకు టీజర్ అని చెప్పొచ్చు. అలానే ఈ చిత్రంలో కృతి ఖర్భందా రామ్ చరణ్ సిస్టర్ పాత్రలో కనిపిస్తుంది. రామ్ చరణ్ ను, చిరంజీవి గారిని ఒకే సినిమాలో చూపించే అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. మంచి కథను ఎంటర్టైనింగ్ చెప్పాలని ఈ సినిమా చేసాను. నా పుట్టినరోజు(24 సెప్టెంబర్) సందర్భంగా వన్ మినిట్ సాంగ్ ట్రైలర్ ను రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ గారు భావిస్తున్నారు. దాదాపు సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. రెండు పాటలు, చిన్న పోర్షన్ మాత్రమే మిగిలి ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 2న ఆడియో విడుదల చేసి అక్టోబర్ 16న సినిమాను రిలీజ్ చేయనున్నాం. మెగాభిమానులు ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది.. అని చెప్పారు.

నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ.. డైరెక్టర్ గారు తక్కువ సమయంలో పెద్ద సినిమా చేసారు. ఆర్టిస్టులు అందరూ బాగా కోపరేట్ చేసారు. రామ్ చరణ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. నా బ్యానర్ వచ్చిన సినిమాలన్నింటిలో గ్రాండియర్ గా ఉండే సినిమా ఇది. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.. అని చెప్పారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ