Advertisementt

కేటుగాడుకి సూపర్ రెస్పాన్స్ అంట!

Wed 23rd Sep 2015 01:04 AM
ketugadu movie,kittu nalluri,tejas,chandini chowdary  కేటుగాడుకి సూపర్ రెస్పాన్స్ అంట!
కేటుగాడుకి సూపర్ రెస్పాన్స్ అంట!
Advertisement
Ads by CJ

తేజస్‌, చాందిని జంటగా వి.ఎస్‌.పి. తెన్నేటి సమర్పణలో వెంకటేష్‌ మూవీస్‌, 100 క్రోర్స్‌ అకాడమీ పతాకాలపై కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేష్‌ బాలసాని నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కేటుగాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు కిట్టు నల్లూరి మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ అయిన రోజు భయపడ్డాను కాని మిశ్రమ స్పందన లభించింది. రోజురోజుకి కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ లో సప్తగిరి కామెడీ, సెకండ్ హాఫ్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కొత్త హీరోని మాస్ యాంగల్ లో ఎక్కువగా చూపిస్తే ప్రక్షకులకు నచ్చదని క్లైమాక్స్ లో టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చాం. చాందిని చౌదరి కి షార్ట్ ఫిల్మ్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ మా సినిమాకు కూడా హెల్ప్ అయింది. డైరెక్టర్ గా ఈ సినిమా ద్వారా అరవై శాతం సక్సెస్ అయ్యాననుకుంటున్నాను. సాటిలైట్ రైట్స్ కూడా మంచిరేట్లకు అమ్ముడిపోయాయి. సినిమా సక్సెస్ తో ప్రొడ్యూసర్ చాలా సంతోషంగా ఉన్నారు. నా తదుపరి చిత్రం ఇదే బ్యానర్ స్టార్ హీరో హీరోయిన్స్ తో ఉంటుంది.. అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ