Advertisementt

సుబ్రమణ్యం ఫర్ సేల్ సెన్సార్ రిపోర్ట్!

Tue 22nd Sep 2015 05:27 AM
subrahmanyam for sale,saidharamtej,hareesh shankar,dil raju  సుబ్రమణ్యం ఫర్ సేల్ సెన్సార్ రిపోర్ట్!
సుబ్రమణ్యం ఫర్ సేల్ సెన్సార్ రిపోర్ట్!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా రెజీనా హీరోయిన్‌గా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై హరీష్‌శంకర్‌.ఎస్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్‌ 24న విడుదలవుతుంది. ఈ సందర్భంగా... 

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ..పిల్లానువ్వులేని జీవితం తర్వాత మా బ్యానర్‌లో సాయిధరమ్‌తేజ్‌ చేస్తున్న రెండో సినిమా సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌. హరీష్‌శంకర్‌ తనదైన మార్క్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పక్కా మాస్‌ సినిమా. హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌. ఈ సినిమాతో తేజుకి తొలిప్రేమ సినిమాతో పవన్‌కల్యాణ్‌గారికి, ఆర్యతో బన్నికి ఎంత యూత్‌ఫుల్‌ ఇమేజ్‌ వచ్చిందో అంతటి ఇమేజ్‌ వస్తుంది. పిల్లానువ్వులేని జీవితం హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న తేజ్‌,రెజీనాలు మరోసారి ఆ మ్యాజిక్‌ను చేస్తారు. థియేట్రికల్‌ ట్రైలర్‌కి, మిక్కి జె.మేయర్‌ అందించిన సంగీతానికి ఆడియెన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. సినిమాని సెప్టెంబర్‌ 24న గ్రాండ్‌ లెవల్‌లో విడుదల చేస్తున్నాం. తప్పకుండా మెగా అభిమానులను, అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే మూవీ అవుతుంది.. అన్నారు. 

దర్శకుడు హరీష్‌ శంకర్‌.ఎస్‌ మాట్లాడుతూ.. దిల్‌రాజు అన్నయ్యతో సినిమా చేయడం చాలా హ్యపీగా ఉంది. ఈ బ్యానర్‌ను నా హోమ్‌ బ్యానర్‌లా ఫీలవుతుంటాను. ఈ సినిమాకి మిక్కి జె మేయర్‌తో అందించిన మ్యూజిక్‌కి ఆడియెన్స్‌ నుండి సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో తేజు డిఫరెంట్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తాడు. అవుటండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌. క్లాస్‌, మాస్‌ సహా అందరికీ నచ్చే విధంగా, లవ్‌ స్టోరితో పాటు అన్నీ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండేలా తేజు క్యారెక్టర్‌ ఉంటుంది. తేజు యాక్ట్‌ చేసిన రేయ్‌, పిల్లా నువ్వులేని జీవితం చిత్రాల కంటే ఈ సినిమా నెక్స్‌ట్‌ లెవల్‌లో ఉంటుంది. సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ నెల 24న గ్రాండ్‌ లెవల్‌లో విడుదలవుతుంది.. అన్నారు. 

సాయిధరమ్‌తేజ్‌, రెజీనా, బ్రహ్మానందం, సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావురమేష్‌, ఫిష్ వెంకట్, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, వెంకట్‌, ఆర్ట్‌: రామకృష్ణ, స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, సతీష్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, కో-ప్రొడ్యూసర్స్‌: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌ ఎస్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ