Advertisementt

అఖిల్ మూవీ ఆడియో విశేషాలు!

Mon 21st Sep 2015 05:57 AM
akhil movie,akhil,vinayak,nithin,nagarjuna,mahesh babu  అఖిల్ మూవీ ఆడియో విశేషాలు!
అఖిల్ మూవీ ఆడియో విశేషాలు!
Advertisement
Ads by CJ

అఖిల్‌ అక్కినేని హీరోగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై హీరో నితిన్‌ నిర్మిస్తున్న చిత్రం అఖిల్. ఎస్.ఎస్.తమన్, అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతాన్నందించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని జరిగింది. అక్కినేని నాగార్జున ఆడియో సీడీలను విడుదల చేసారు. మహేష్ బాబు, నాగార్జున సంయుక్తంగా థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. 

మహేష్ బాబు మాట్లాడుతూ.. ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. మనం సినిమా టైం లో నాగర్జున గారికి ఫోన్ చేసి సినిమా చాలా బావుంది సర్, లాస్ట్ రెండు నిమిషాల్లో అఖిల్ స్క్రీన్ మీద కనిపించి మెస్మరైజ్ చేసాడని చెప్పాను. దానికి ఆయన సినిమాకు కష్టపడింది మేమైతే క్రెడిట్ అంతా తనే కొట్టేసాడని చెప్పారు. అఖిల్ కి టెరిఫిక్ స్క్రీన్ ప్రెజన్స్ ఉంది. హీరోలను స్క్రీన్ మీద ప్రెజంట్ చేసే విషయంలో వినాయక గారి తరువాతే ఎవరైనా.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మరో పెద్ద హీరోను ఇస్తున్నారు. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి.. అని చెప్పారు.

నాగార్జున మాట్లాడుతూ.. నాన్నగారి పుట్టినరోజు నాడు అఖిల్ ఆడియో ఫంక్షన్ అవ్వడం సంతోషంగా ఉంది. అఖిల్ ఈ సినిమాలో బాగా కనిపించడానికి చాలా మంది కృషి చేసారు. సూపర్ స్టార్ కృష్ణ గారితో నేను వారసుడు సినిమాలో నటించాను. ఈరోజు ఆయన వారసుడు నా వారసుడ్ని ప్రోత్సహించడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులు అఖిల్ ను కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ సంవత్సరం విజయదశమి రోజు అనగా అక్టోబర్ 22న సినిమాను రిలీజ్ చేస్తున్నాం.. అని చెప్పారు.

అఖిల్ మాట్లాడుతూ.. ఈ సినిమా బైట్ కోసం ఫోన్ చేస్తే బైట్ ఎందుకు ఆడియో ఫంక్షన్ కి వస్తానని చెప్పి నన్ను ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మహేష్ బాబు కి స్పెషల్ థాంక్స్.  ఎనిమిది నెలల ముందు బ్లాక్ బాస్టర్ హిట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పాను. వినాయక్ గారు సినిమా ఇండస్ట్రీకి బంగారం. నన్ను కొడుకులా, ఫ్రెండ్ గా, ఫ్యామిలీ మెంబర్ గా చూసుకున్నారు. ఆయన హీరోలను డైమండ్ లా చూసుకుంటారు. నెక్స్ట్ మూవీ నాతో చేస్తానని కమిట్మెంట్ ఇచ్చారు. ఈ సినిమాకు మ్యూజిక్ చేసిన అనూప్ కు, తమన్ కు పెద్ద థాంక్స్. ముఖ్యంగా అనూప్ లైఫ్ పెట్టి ఈ సినిమాకు పని చేసాడు. వినాయక్ గారు సినిమాను కొత్త యాంగల్ లో చూపించారు. దానికి డిఓపి ఎంతగానో సపోర్ట్ చేసారు. టెక్నికల్ టీం అంతా చాలా కష్టపడి పని చేసారు. ఈ సినిమాకు నాకంటే నా చుట్టూ ఉన్నవారే ఎక్కువగా కష్టపడ్డారు. ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు వెన్నంటే ఉండి ఈ సినిమాను నడిపించారు. వినాయక్ గారు ముందు సుధాకర్ గారు వెనుక ఉన్నారనే కాన్ఫిడెన్స్ తో ఈ మూవీ చేసాను. నితిన్, వినాయక్ గారితో సినిమా చేసి బ్లాక్ బాస్టర్ హిట్ ఇవ్వు అని నా కాలర్ పట్టుకొని సినిమా చేయించాడు. నా తల్లితండ్రులు, అన్నయ్య తో నా మొదటి సినిమా ఆడియో లాంచ్ చేయాలని డ్రీమ్ ఉండేది. ఈరోజు నా కల నెరవేరుతుంది.. అని చెప్పారు.

నితిన్ మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ కు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన మహేష్ గారికి థాంక్స్. ఈ సినిమాకు మెయిన్ బ్యాక్ బోన్ మా అక్క, నాన్నగారు. అక్కినేని కుటుంబం నుండి వస్తున్న మూడవ జనరేషన్ హీరోని మా బ్యానర్ ద్వారా లాంచ్ చేసే అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి మా కృతజ్ఞతలు. వినాయక్ గారి మొదటి సినిమా ఆది కోసం ఎంత భయపడ్డారో ఈ సినిమా కోసం ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ సినిమా చేసాం. అఖిల్ మెచ్యూర్డ్ లెవెల్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ డెబ్యూ యాక్టర్ లో చూడలేదు. కష్టమైన లొకేషన్స్ లో, అతి తక్కువ టెంపరేచర్ లో ఈ సినిమా షూట్ చేసాం. అఖిల్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తను పెద్ద పొజిషన్ కు వెళ్ళాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ అవుతుందని నాగార్జున గారికి ప్రామిస్ చేసాం. అఖిల్ సూపర్ స్టార్ అవుతాడని చుసిన వారంతా చెబుతున్నారు. కాని తనతో సినిమా చేసినవాడిని నేను చెబుతున్నాను అఖిల్ ఖచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు. టెక్నీషియన్స్ అంతా ఈ సినిమా కోసం ఎంతగానో సపోర్ట్ చేసారు. సుధాకర్ గారి దైర్యమే మమ్మల్ని ముందుకు నడిపింది. నితిన్ బాగా సపోర్ట్ చేసాడు.. అని చెప్పారు.

నాగచైతన్య మాట్లాడుతూ.. అక్కినేని ఫ్యామిలీ ను, ఫ్యాన్స్ ను ఒకే వేదికపై చూడడం చాలా సంతోషంగా ఉంది. తాతగారు ఒక స్టాంప్ వేసి వెళ్ళిపోయారు. ఆయన పేరుని నిలబెట్టడానికి ఆడియన్స్ సపోర్ట్ మాకు ఎప్పటికి కావాలి. అఖిల్ సిసింద్రీ సినిమాలో పాక్కుంటూ వెళ్లి హిట్ కొట్టాడు. మనం లో రెండు నిమిషాలు కనిపించి మరో హిట్ కొట్టాడు. ఈ సినిమాతో అఖిల్ హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నాను. మొదటి సినిమాలో అందరూ ఏం చేయలేరో అది అఖిల్ చేసి చూపిస్తాడు. సినిమాలో అఖిల్ ను బాగా చూపించిన వినాయక్ గారికి థాంక్స్. ఇద్దరు సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ సినిమాకు పని చేసారు.. అని చెప్పారు.

సయేషా సైగల్ మాట్లాడుతూ.. అఖిల్ తో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తను మంచి డాన్సర్. నా మొదటి సినిమానే వినాయక్ గారి డైరెక్షన్ లో చేయడం అద్రుష్టంగా భావిస్తున్నాను.. అని చెప్పారు.

నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ.. నిఖిల్ హీరో అయ్యి కూడా అఖిల్ ను లాంచ్ చేయడం, తోటి హీరోను ఎంకరేజ్ చేయడానికి మహేష్ బాబు రావడం అభినందించాల్సిన విషయాలు. చిన్నప్పటి నుండి నేను అఖిల్ ను చూస్తున్నాను. తనలో మంచి ఎనర్జీ ఉంటుంది. సినిమా యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.

కొరటాల శివ మాట్లాడుతూ.. నాగేశ్వరావు గారి గురించి వింటూ, నాగార్జున గారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఈరోజు ఆ కుటుంబం నుండి మరో టాలెంట్ రాబోతోంది. అమేజింగ్ టాలెంట్ ను వినాయక్ చేతిలో పెడితే ఎలా ఉంటుందో అందరికి తెలుసు. నితిన్ హీరో అయినా ఎంతో రిచ్ గా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసాడు. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. వినాయక్ గారి అఖిల్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ సినిమా పెద్ద సక్సే కావాలి. యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.

బండ్ల గణేష్ మాట్లాడుతూ.. బాహుబలి సినిమాను రాజమౌళి హాలీవుడ్ కు పరిచయం చేస్తే హాలీవుడ్ హీరో లాంటి అఖిల్ ను వినాయక్ తెలుగు ఇండస్ట్రీ కు పరిచయం చేస్తున్నారు. ఈరోజు పాటల్లో అఖిల్ డాన్సులు చూసి బిత్తరపోయాను. అధ్బుతంగా డాన్సు చేసాడు. నితిన్ మంచి వాల్యూస్ తో సినిమా చేసారు.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో అమల అక్కినేని, సుమంత్, సుశాంత్, నాగసుశీల, సి.కళ్యాన్, అనూప్ రూబెన్స్, కోనవెంకట్, భాస్కర్ భట్ల, కృష్ణ చైతన్య, నికితా రెడ్డి, బి.ఏ.రాజు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ