Advertisementt

ప్రేమికులపై పీహెచ్ డీ ఆడియో విశేషాలు!

Sun 20th Sep 2015 04:17 AM
premikulapai phd,adhithya,kota muneesh,lakshmi sreevasthava  ప్రేమికులపై పీహెచ్ డీ ఆడియో విశేషాలు!
ప్రేమికులపై పీహెచ్ డీ ఆడియో విశేషాలు!
Advertisement
Ads by CJ

ఆదిత్య, సోనాలి, శిరీష ప్రధాన పాత్రల్లో ఆక్సాల్ట్ సమర్పణలో ఆదిత్య క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా ప్రేమికులపై పీహెచ్ డీ. కోటా మునీష్ దర్శకుడు. నిర్మాత లక్ష్మీ శ్రీవాస్తవ. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బెక్కం వేణుగోపాల్ సీడీలను విడుదల చేయగా సాయి వెంకట్ మొదటి కాపీను అందుకున్నారు. ఈ సందర్భంగా..

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది. యూత్ ఫుల్ సినిమాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ఆ జోనర్ లో వస్తున్న సినిమా పెద్ద హిట్ కావాలి.. అని అన్నారు.

సంగీత దర్శకుడు రమేష్ ముక్కెర మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.. అని చెప్పారు.

నిర్మాత లక్ష్మీ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఈ సినిమాలో మా హీరో ప్రేమపై పరిశోధన చేస్తాడు. ఈ పాయింట్ సినిమాలో కొత్తగా అనిపిస్తుంది. షూటింగ్ పూర్తయింది.. అని చెప్పారు. 

దర్శకుడు కోటా మునీష్ మాట్లాడుతూ.. దర్శకుడిగా ఇది నాకు మూడో సినిమా. మంచి లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాలో  హీరోకి ప్రేమ మీద నమ్మకం ఉండదు. కానీ ప్రేమపై అతను చేసే రీసెర్చ్ పూర్తయ్యే సరికి అతను ప్రేమలో పడతాడు. ఆ విషయాలు ఆసక్తికరంగా సాగుతాయి. మంచి పాటలు కుదిరాయి.. అని అన్నారు.

హరి కృష్ణ, ఫిష్ వెంకట్, తాగుబోతు ఫణి, చిట్టి బాబు, గబ్బర్సింగ్ బ్యాచ్, సాయి బాబా, ఆంజనేయులు, ప్రవీణ్, బంటి, జీవన్ కీలక పాత్రధారులు.  ఈ సినిమాకు కెమెరా: ఆనం వెంకట్, లిరిక్స్ : ఎం.రమేష్, సంగీతం: రమేష్ ముక్కెర, రీరికార్డింగ్: రవిశంకర్, డీఐ: జైబీ టెక్ ప్రై. లిమిటెడ్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ