Advertisementt

కళ్యాణ్‌రామ్‌ షేర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్!

Sun 20th Sep 2015 04:08 AM
sher,kalyan ram,kalyan ram sher movie,sher movie audio release date,sher movie release date  కళ్యాణ్‌రామ్‌ షేర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్!
కళ్యాణ్‌రామ్‌ షేర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement
Ads by CJ

అక్టోబర్‌ 30న నందమూరి కళ్యాణ్‌రామ్‌ షేర్‌

డైనమిక్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్‌ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షేర్‌. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 30న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాత కొమర వెంకటేష్‌ సన్నాహాలు చేస్తున్నారు. 

అక్టోబర్‌ 10న ఆడియో 

ఈ సందర్భంగా నిర్మాత కొమర వెంకటేష్‌ మాట్లాడుతూ - మా సినిమాకి సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ టోటల్‌గా కంప్లీట్‌ అయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌ 30న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌ 10న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చారు. నిర్మాతల హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌గారితో షేర్‌ లాంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చెయ్యడం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు. మల్లికార్జున్‌ ఎక్స్‌ట్రార్డినరీ టేకింగ్‌తో సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రానికి కళ్యాణ్‌రామ్‌గారి పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుంది. పటాస్‌ తో సూపర్‌హిట్‌ సాధించిన కళ్యాణ్‌రామ్‌గారికి షేర్‌ మరో పెద్ద హిట్‌ సినిమా అవుతుంది.. అన్నారు. 

దర్శకుడు మల్లికార్జున్‌ మాట్లాడుతూ - అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం కళ్యాణ్‌రామ్‌గారి కెరీర్‌లో మరో సెన్సేషనల్‌ మూవీ అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌గారి పెర్‌ఫార్మెన్స్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంటుంది. థమన్‌ సూపర్‌హిట్‌ సాంగ్స్‌ని చేశారు. ఆడియో కూడా పెద్ద హిట్‌ అవుతుంది.. అన్నారు. 

డైనమిక్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్‌ రత్నబాబు, సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌., సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: సత్యశ్రీనివాస్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, స్టిల్స్‌: మనీషా ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: హరీష్‌రెడ్డి యల్లన్నగారి, మేనేజర్స్‌: బోడంపాటి శ్రావణ్‌కుమార్‌ గౌడ్‌, కురిమెండ్ల రవీంద్రగౌడ్‌, మేకప్‌: మోహనరావు, కాస్ట్యూమ్స్‌: శ్రీను, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలే, ఛీఫ్‌ కోడైరెక్టర్‌: బూరుగుపల్లి సత్యనారాయణ, కోడైరెక్టర్‌: శేషు బలగ, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్‌, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్‌, నిర్మాత: కొమర వెంకటేష్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మల్లికార్జున్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ