Advertisementt

అప్పుడలా ఇప్పుడిలా ఆడియో విశేషాలు!

Sat 19th Sep 2015 03:54 AM
appudala ippudila movie,suryatej,vishnu,pradeep kumar  అప్పుడలా ఇప్పుడిలా ఆడియో విశేషాలు!
అప్పుడలా ఇప్పుడిలా ఆడియో విశేషాలు!
Advertisement

సూర్యతేజ్, హర్షిక పూనాచా జంటగా జంపా క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం అప్పుడలా ఇప్పుడిలా. కె.ఆర్.విష్ణు దర్శకుడు. ప్రదీప్ కుమార్ జంపా నిర్మాత. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. కోడి రామకృష్ణ బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, కోడి రామకృష్ణ సంయుక్తంగా ధియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా..

కోడి రామకృష్ణ మాట్లాడుతూ.. దర్శకుడు విష్ణు నా వద్ద పని చేశాడు. మంచి ప్లానింగ్ ఉంది. తప్పకుండా పెద్ద దర్శకుడవుతాడు. ఈ చిత్రం విజయవంతమై నిర్మాతకు డబ్బులొచ్చి నవ్వుతో 100 రోజుల వేడుక జరపాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు, చిత్రాలు అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్నాయి. మంచి సినిమా ఎప్పుడొచ్చినా వారు ఆదరిస్తున్నారు. టీం అందరికీ అల్ ది బెస్ట్.. అని అన్నారు. 

నిర్మాత ప్రదీప్ కుమార్ జంపా మాట్లాడుతూ.. చిన్న పాయింట్ మీద బ్రహ్మ మంచి స్క్రిప్ట్ రాశాడు. దర్శకుడు బాగా తెరకెక్కించారు. నరేష్ గారు ఈ జర్నీలో ఎంతో క్లోజ్ అయ్యారు, హెల్ప్ చేశారు. ఈ సినిమాలో ఆయన పాత్ర అల్టిమేట్‌గా ఉంటుంది. ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.. అని అన్నారు. 

సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ.. ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాకు మ్యూజిక్ చేశాను. ప్రతి పాటకు సినిమాతో కనెక్షన్ ఉంటుంది. సుమన్, నరేష్ పెర్ఫార్మన్స్ సూపర్బ్. విష్ణు దర్శకత్వం అధ్బుతంగా ఉంటుంది. చైతన్య మంచి లిరిక్స్ రాశాడు.. అని అన్నారు. 

దర్శకుడు విష్ణు మాట్లాడుతూ.. ఈ అవకాశాన్నిచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. సంగీత దర్శకుడు చాలా మంచి బాణీలిచ్చారు. సూర్యతేజ ఈ సినిమాలో తన యాక్టివ్‌ పెర్ఫార్మెన్స్‌ను చూపించాడు. నరేష్‌గారు, సుమన్‌గారు అద్బుతంగా నటించారు.. అని చెప్పారు. 

నరేష్ మాట్లాడుతూ.. ఇపుడున్న ట్రెండ్ కి కరెక్ట్ టైటిల్, కథ. రామానాయుడు తర్వాత అంత డెడికేషన్, కమిట్మెంట్ ఉన్న నిర్మాత ప్రదీప్ కుమార్. దర్శకుడు బాగా తీశారు. సునీల్ కశ్యప్ లవ్లీ మ్యూజిక్ ఇచ్చాడు.. అని అన్నారు. 

సుమన్ మాట్లాడుతూ.. నన్ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన కోడి రామకృష్ణ గారు ఆడియోకి రావడం సంతోషం. ఆయన శిష్యుడు విష్ణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అతనిలో చాలా క్లారిటీ ఉంది. సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సూర్యతేజ్, హర్షిక బాగా నటించారు. ఫ్యామిలీ అంతా కలసి చూసే సినిమా ఇది.. అని అన్నారు. 

నిఖిల్, నవదీప్, రాహుల్ రవీంద్రన్, అనిల్ రావిపూడి, సాయి కిరణ్ అడవి, ప్రవీణ్ సత్తారు, వీరశంకర్, బెక్కం వేణుగోపాల్, హర్షిక పూనాచ, సూర్యతేజ్, దర్శకుడు విష్ణు, శివారెడ్డి, రఘునాథ రెడ్డి తదితరులు ఆడియో వేడుకకు హాజరయ్యారు. చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 

సుమన్, నరేష్, సుధ, శివారెడ్డి, సుప్రీత్, పృథ్వీ, ప్రభాస్ శీను తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ : కె.బ్రహ్మారెడ్డి, మాటలు : పానుగంటి విజయ్, పాటలు : చైతన్య వర్మ, సినిమాటోగ్రఫీ : పిసి ఖన్నా, ఎడిటింగ్ : ఎస్.బి.ఉద్దవ్, సంగీతం : సునీల్ కశ్యప్, నిర్మాత : ప్రదీప్ కుమార్ జంపా, స్క్రీన్ ప్లే - దర్శకత్వం : కె.ఆర్.విష్ణు.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement