Advertisementt

రాజుగారిగది ట్రైలర్ లాంచ్!

Thu 17th Sep 2015 09:57 AM
raju gari gadi,omkar,ashwin kumar,vinayak,sai kartheek  రాజుగారిగది ట్రైలర్ లాంచ్!
రాజుగారిగది ట్రైలర్ లాంచ్!
Advertisement

అశ్విన్ బాబు, చేతన్, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రాజు గారి గది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వినాయకచవితి సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వి.వి.వినాయక్, చోటా కె నాయుడు ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా.. 

వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్ బావుంది. ఓంకార్ చాలా కమిట్మెంట్ తో పని చేస్తాడు. ఈ సినిమా ఆయనకు పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

చోటా కె నాయుడు మాట్లాడుతూ.. సినిమా లోగో, ట్రైలర్ కొత్తగా ఉన్నాయి. టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు చాలా కష్టపడి పని చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో హాలీవుడ్ స్టాండర్డ్స్ కనిపిస్తున్నాయి. సినిమా యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.

జెమినీ కిరణ్ మాట్లాడుతూ.. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద సక్సెస్ కావాలి.. అని చెప్పారు.

ఓంకార్ మాట్లాడుతూ.. నా మొదటి సినిమా జీనియస్ లో టెక్నికల్ వాల్యూస్, కంటెంట్ బావుందని అందరూ చెప్పారు. కాని కమర్షియల్ గా మాత్రం వర్కవుట్ కాలేదు. ఈ సినిమాతో మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. 42 రోజుల్లో మూడు కోట్ల బడ్జెట్ లో సినిమా పూర్తి చేసాం.. అని చెప్పారు.

సాయి మాధవ్ బుర్ర మాట్లాడుతూ.. ఇది నాకు కొత్త జోనర్. ఓంకార్ గారు కథ చెప్పగానే ఒప్పుకున్నాను. ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోజింపజేస్తుంది. మంచి సినిమా అవుతుంది. ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది.. అని చెప్పారు.

సాయి కార్తిక్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో భయం, ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. వినాయకచవితి రోజు ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

సినిమాటోగ్రాఫర్ జ్ఞానం మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. రాజు గారి గదిలో మంచి మెసేజ్ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అధ్బుతంగా వచ్చాయి. ఈ చిత్రంతో ఓంకార్ గారికి మంచి పేరు రావాలి.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో అశ్విన్ బాబు, చేతన్, ధనరాజ్, షకలక శంకర్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, లిరిక్స్: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్: సాహి సురేష్, ఎడిటర్: నాగరాజ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎస్.జ్ఞానం, మ్యూజిక్: సాయి కార్తిక్, ప్రొడ్యూసర్: ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఓంకార్ . 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement