రాజ్ తరుణ్, హేభ పటేల్ జంటగా సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్నచిత్రం కుమారి 21ఎఫ్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ఆదివారం హైదరాబాద్ లోని దేవిశ్రీప్రసాద్ విడుదల చేసారు. ఈ సందర్భంగా..
దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి మాట్లాడుతూ.. దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తయింది. మేము అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తిచేసి విడుదల చేయడానికి టెక్నికల్ టీం ఎంతగానో సహకరించింది. రత్నవేలు గారు లేకపోతే సినిమా చేయలేకపోయేవాళ్ళం. మా అందరితో ఇంత బాగా వర్క్ చేయించింది సుకుమార్ గారే.. అని చెప్పారు.
రత్నవేలు మాట్లాడుతూ.. సినిమా కథ వైవిధ్యంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. రాజ్ తరుణ్ న్యాచురల్ గా పెర్ఫార్మ్ చేస్తాడు. దేవిశ్రీప్రసాద్ అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ప్రతి ట్యూన్ డిఫరెంట్ గా ఉంటుంది. అక్టోబర్ 30న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. సుకుమార్ గారి కథంటేనే ఎగ్జైట్మెంట్ గా ఉంటుంది. ఇదొక యూనిక్ ఫిలిం అవుతుంది. ఇప్పటికే రెండు హిట్ సినిమాలతో రాజ్ తరుణ్ మంచి ఫాంలో ఉన్నాడు. ఈ సినిమాతో ఇంకా మంచి పేరు వస్తుంది. రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ అంటే విజువల్స్ అధ్బుతంగా ఉంటాయి. పాటలను విజువల్స్ డామినేట్ చేసేలా ఉంటాయి. మౌనరాగం, ప్రేమదేశం, గీతాంజలి చిత్రాలను చూసినప్పుడు ఎంత ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుందో ప్రస్తుతం ఉన్న జనరేషన్ కు ఈ సినిమా చూస్తే అంత ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన సందేశాత్మక చిత్రమిది. అన్ని రకాల ఆడియన్స్ కు సినిమా కనెక్ట్ అవుతుంది. ఆడియో రిలీజ్ కు ముందుగానే ఓ పాటను రిలీజ్ చేయాలనుకుంటున్నాం.. అని చెప్పారు.
రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. పెద్ద సినిమాలో హీరోగా నటిస్తున్నందుకు నా అద్రుష్టంగా భావిస్తున్నాను. రత్నవేలు గారి సినిమాకు బ్యాక్ బోన్. దేవిశ్రీ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రతాప్ గారు బాగా డైరెక్ట్ చేసారు.. అని చెప్పారు.
నిర్మాతలు విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతోంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అధ్బుతంగా ఉంటుంది. రాజ్ తరుణ్, హేభ పటేల్ బాగా నటించారు. అక్టోబర్ 30న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.
రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్, సమర్పణ: సుకుమార్, నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి,కథస్కీన్‌ప్లే-మాటలు: సుకుమార్, దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్.