Advertisement

శివం ఆడియో విశేషాలు..!

Mon 14th Sep 2015 04:02 AM
sivam movie,ram,rashikhanna,sravanthi ravikishore,sreenivasa reddy  శివం ఆడియో విశేషాలు..!
శివం ఆడియో విశేషాలు..!
Advertisement

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం శివం. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని శిల్పకళావేదిక లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అరవింద్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీను దేవిశ్రీప్రసాద్ కు అందించారు. ఈ సందర్భంగా..

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. రవికిషోర్ గారికి నాకు ముప్పై సంవత్సరాల నుండి పరిచయం ఉంది. సినిమానే నమ్ముకొని ఉన్న అతి తక్కువ మంది నిర్మాతల్లో ఒకరాయన. రామ్ ఆల్రెడీ స్టార్ హీరో. ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. రాశి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దేవిశ్రీ మ్యూజిక్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఐదు సంవత్సరాలుగా దేవిశ్రీ ను హీరోగా ఓ సినిమా చేయమని అడుగుతున్నాను. చేద్దాం అంటున్నాడు కాని ఇంకా చేయలేదు(నవ్వుతూ..).. అని చెప్పారు.

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. రవికిషోర్ గారు మంచి మనిషి.ఈ బ్యానర్ స్థాపించి ముప్పై సంవత్సరాలవుతున్న ఈ సందర్భంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రామ్ నాకంటే  ఎనర్జిటిక్ గా ఉంటాడు. రాశి బాగా నటించింది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.. అని చెప్పారు.

దర్శకుడు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్రవంతి రవికిషోర్ గారికి, హీరో రామ్ గారికి ధన్యవాదాలు.. అని చెప్పారు.

రామ్ మాట్లాడుతూ.. స్రవంతి మూవీస్ బ్యానర్ ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. పెదనాన్న గారే నాకు బ్యాక్ బోన్. శ్రీనివాస రెడ్డి చాలా బాగా డైరెక్ట్ చేసారు. రసూల్ గారి విజువల్స్ అందరికి నచ్చుతాయి. దేవిశ్రీ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. దేవి కాంబినేషన్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాను.. అని చెప్పారు.

రాశిఖన్నా మాట్లాడుతూ.. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన రవికిషోర్ గారికి స్పెషల్ థాంక్స్. రామ్ లో మంచి ఎనర్జీ ఉంటుంది. రాకింగ్ మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ కు, నన్ను అందంగా చూపించిన రసూల్ గారికి థాంక్స్.. అని చెప్పారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. స్రవంతి మూవీస్ లో సినిమాలు వచ్చినప్పుడు నేను ప్రేక్షకుడిగా చూసేవాడ్ని. వారు నిర్మించిన వారసుడొచ్చాడు చిత్రాన్ని ఆరు సార్లు చూసాను. ఓ ప్రొడ్యూసర్ ను చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రొడ్యూసర్ గా మారారు అనడానికి ఉదాహరణ నేనే. పండగ చేస్కో సినిమాతో మంచి హిట్ కొట్టి ఇప్పుడు శివమ్ తో ముందుకొస్తున్న రామ్ కు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. దేవిశ్రీ ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇస్తాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తాడు. టీం అందరికి ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద సక్సెస్ కావాలి.. అని చెప్పారు.

విజయభాస్కర్ మాట్లాడుతూ.. రవికిషోర్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయనతో సినిమాలు చేసాం. నిర్మాతగా ఎప్పుడు మమ్మల్ని కష్టపెట్టలేదు. రామ్ మంచి ఫాం లో ఉన్నాడు. సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ.. సినిమాల పట్ల ప్యాషన్ తో బాగా తీయాలనుకునే అతి తక్కువ మంది నిర్మాతల్లో స్రవంతి రవికిషోర్ ఒకరు. ఆయన నిర్మించిన దాదాపు అన్ని చిత్రాల్లో నేను నటించాను. రెడీ చిత్రం నుంచి రామ్ తో మంచి అనుభవం ఉంది. సెట్స్ లో నన్ను తమ్ముడు అని పిలుస్తాడు. రాశిఖన్నా, రామ్ ల జంట తెరపై చాలా అందంగా ఉంటుంది. ఇదొక పవర్ ప్యాక్డ్ ఫిలిం. రసూల్ సినిమాటోగ్రఫీ, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ లో వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి.. అని చెప్పారు.

భాస్కర్ భట్ల మాట్లాడుతూ.. ఈ బ్యానర్ లో పని చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఈ సినిమాలో పాటలన్నీ రాసే అవకాశం ఇచ్చిన రవికిషోర్ గారికి థాంక్స్. దేవిశ్రీప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో మొదటిసారి వర్క్ చేసాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో కొడాలి వెంకటేశ్వరావు, ప్రథాని రామకృష్ణ గౌడ్, ఎస్.వి.కృష్ణారెడ్డి, అశోక్ కుమార్, రసూల్ ఎల్లోర్, కిషోర్ తిరుమల, మధు, రమణ, సంధ్య, వేమూరి సత్యనారాయణ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, హరి అనుమోలు, పెద్ద వంశి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement