Advertisementt

కొరియర్ బాయ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఖరారు!

Sat 12th Sep 2015 09:54 AM
courier boy kalyan,gautham menon,nithin,prem sai  కొరియర్ బాయ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఖరారు!
కొరియర్ బాయ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఖరారు!
Advertisement
Ads by CJ

నితిన్, యామీగౌతమ్ జంటగా ఫోటాన్ కతాస్ బ్యానర్ పై ప్రేమ్ సాయి దర్శకత్వంలో గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న చిత్రం కొరియర్ బాయ్ కళ్యాణ్. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో..

గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న రిలీజ్ చేస్తున్నాం. ఇదొక కుటుంబ కథా చిత్రం. కామెడీ, లవ్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. నితిన్ నటన, మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తాయి. సినిమాలో మొత్తం నాలుగు పాటలుంటాయి. మూడు పాటలకు మ్యూజిక్ కార్తిక్ చేయగా ఒక పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసారు. సందీప్ చౌహాన్ గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. సినిమాకి స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలుస్తుంది. త్వరలోనే నితిన్ హీరోగా లవ్ అండ్ యాక్షన్ జోనర్ లో ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలనుకుంటున్నాం.. అని చెప్పారు.

నితిన్ మాట్లాడుతూ.. ఇదొక కంటెంట్ బేస్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. కామన్ మ్యాన్ కు ఓ సమస్య వస్తే ఎలా ఎదిరించాడనేదే ఈ సినిమా. చాలా న్యాచురల్ గా ఉంటుంది. సినిమాలో నేను చెప్పే పాయింట్ కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు ఆ పాయింట్ ఎవరు టచ్ చేయలేదు. రిలీజ్ ఇంత లేట్ అయినా మేమంతా మాత్రం సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ప్రేమ సాయి ఈ మూవీ కోసం బాగా కష్టపడ్డాడు. కాన్ఫిడెంట్ గా తెరకెక్కించాడు. నా కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ అన్ని చూసాను. ఇమేజ్ పక్కన పెట్టి కంటెంట్ ను నమ్మి సినిమా చేసాను. కమర్షియల్ మూవీను డిఫరెంట్ పాటర్న్ లో చూపించారు.. అని చెప్పారు  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ