డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై మల్లికార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ షేర్. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ టోటల్‌గా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సందర్భంగా..
నిర్మాత కొమర వెంకటేష్ మాట్లాడుతూ.. నిర్మాతల హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌గారితో సినిమా చెయ్యడం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌గారు ఓ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు. షూటింగ్ టోటల్‌గా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. థమన్ ఈ చిత్రానికి సూపర్‌హిట్ మ్యూజిక్ అందించారు. అన్ని పాటలూ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. ఆడియోను ఈ నెలాఖరులో చాలా రిలీజ్ చేస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ రెండోవారంలో ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పటాస్‌తో సూపర్‌హిట్ సాధించిన కళ్యాణ్‌రామ్‌గారికి షేర్ కూడా మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది.. అని అన్నారు.
దర్శకుడు మల్లికార్జున్ మాట్లాడుతూ.. కళ్యాణ్‌రామ్‌గారి కెరీర్‌లో షేర్ ఒక సెన్సేషనల్ మూవీ అవుతుంది. నందమూరి అభిమానులు పండగ చేసుకునేలా ఈ సినిమా వుంటుంది. పటాస్ తర్వాత మళ్ళీ కళ్యాణ్‌రామ్‌గారు ఈ సినిమాలో విజృంభించి నటించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న షేర్ అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా వుంటుంది.. అని అన్నారు.
డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్, సోనాల్‌చౌహాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: థమన్ ఎస్.ఎస్., సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: సత్యశ్రీనివాస్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, స్టిల్స్: మనీషా ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: హరీష్‌రెడ్డి యల్లన్నగారి, మేనేజర్స్: బోడంపాటి శ్రావణ్‌కుమార్ గౌడ్, కురిమెండ్ల రవీంద్రగౌడ్, మేకప్: మోహనరావు, కాస్ట్యూమ్స్: శ్రీను, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, ఛీఫ్ కోడైరెక్టర్: బూరుగుపల్లి సత్యనారాయణ, కోడైరెక్టర్: శేషు బలగ, లైన్ ప్రొడ్యూసర్స్: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్, నిర్మాత: కొమర వెంకటేష్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మల్లికార్జున్.