Advertisementt

కాకి చిత్రం విడుదలకు సన్నాహాలు!

Sat 12th Sep 2015 07:39 AM
kaki movie,patthikonda kiran,ashok kumar,meghasri  కాకి చిత్రం విడుదలకు సన్నాహాలు!
కాకి చిత్రం విడుదలకు సన్నాహాలు!
Advertisement
Ads by CJ

అశోక్ కుమార్, కిరణ్, మేఘాశ్రీ ప్రధాన పాత్రల్లో అర్పిత క్రియేషన్స్ పతాకంపై మనోన్.యం దర్శకత్వంలో కిరణ్ పత్తికొండ నిర్మిస్తున్న సినిమా కాకి. ఈ ఈ చిత్ర విశేషాలు తెలిపేందుకు చిత్రబృందం శనివారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా..

పత్తికొండ కుమారస్వామి మాట్లాడుతూ.. పత్తికొండ కిరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న రెండవ చిత్రమిది. ఒరియాలో ఒక సినిమాను ప్రొడ్యూస్ చేసాడు. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఓ పాత్రలో కూడా నటించాడు. అనుకున్న సమయంలో అనుకున్న రీతిలో ఈ చిత్రాన్ని పూర్తి చేసారు. సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. అని చెప్పారు.

హీరో అశోక్ కుమార్ మాట్లాడుతూ.. తమిళంలో కొన్ని సినిమాల్లో నటించాను. తెలుగులో ఇది నా మొదటి చిత్రం. కాకి అనే టైటిల్ సినిమాకు యాప్ట్ అవుతుంది.. అని చెప్పారు.

హీరోయిన్ మేఘాశ్రీ మాట్లాడుతూ.. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న మూవీ. సినిమాటోగ్రఫీ చాలా బావుంటుంది. సినిమా బాగా వచ్చింది.  సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కూడిన చిత్రమిది. కామెడీ కూడా ఉంటుంది. మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

నిర్మాత పత్తికొండ కిరణ్ మాట్లాడుతూ.. కాకి అనేది డిఫరెంట్ టైటిల్. సబ్జెక్టు కు సూట్ అవుతుంది. 45 రోజులు సినిమా షూటింగ్ చేసాం. అందులో పది రోజులు 24 గంటలు షూట్ చేస్తూనే ఉన్నాం. సినిమాలో సిట్యుయేషన్ లు తగ్గట్లుగా ఒక పాట ఉంటుంది. హారర్ కథకు థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి తీసాం. సినిమాలో మొదటి భాగం కామెడీ తో, రెండవ భాగం హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సాగుతుంటుంది. డైరెక్టర్ కు మొదటి సినిమా అయినా బాగా డైరెక్ట్ చేసారు. ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ జరుగుతుంది. వచ్చే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. రెండు గంటల పది నిమిషాల నిడివి గల ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

దర్శకుడు మనోన్.యం మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. స్టొరీ చెప్పగానే ద్విభాషా చిత్రంగా తెరకెక్కించాలని ప్లాన్ చేసాం. టీం వర్క్ తో తొందరగా సినిమా కంప్లీట్ చేసాం. కథ చాలా కొత్తగా ఉంటుంది.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సర్వన నటరాజన్, రోనాల్డ్ రాజ్.ఎస్.విలియమ్స్ పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: సర్వన నటరాజన్, మ్యూజిక్: అమ్రిత్, ఎడిటర్: శశికుమార్, ఆర్ట్: జె.కె.మూర్తి, డైలాగ్స్: వినోద్ శివ, లిరిక్స్: భాస్కర్ భట్ల, స్టొరీ-ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోనాల్డ్ రాజ్.ఎస్.విలియమ్స్, ప్రొడ్యూసర్: కిరణ్ పత్తికొండ, స్క్రీన్ ప్లే-డైరెక్షన్: మనోన్.యం 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ