Advertisementt

భల్లాలదేవ విడుదలకు రెడీ!

Sat 12th Sep 2015 07:33 AM
bhallaladeva,ravipati sathyanarayana,krishna teja  భల్లాలదేవ విడుదలకు రెడీ!
భల్లాలదేవ విడుదలకు రెడీ!
Advertisement
Ads by CJ

విమల్, బిందు మాధవి జంటగా సత్యదేవ పిక్చర్స్ బ్యానర్ పై రావిపాటి సత్యనారాయణ అందిస్తున్న చిత్రం భల్లాలదేవ. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో..

రావిపాటి సత్యనారాయణ మాట్లాడుతూ.. మా బ్యానర్ లో ఇంతకముందు మల్లి వర్సెస్ రవితేజ అనే చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాం. భల్లాలదేవ మా రెండవ సినిమా. మాతృక దేసింగు రాజా తమిళ్ లో సూపర్ హిట్ అయి నూరు రోజులు ప్రదర్శించబడింది. మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమా. ఈ చిత్రానికి భల్లాలదేవ టైటిల్ యాప్ట్ అవుతుంది. ఇమాన్ అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చారు.  సినిమాలో ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. క్లీన్ యు సర్టిఫికేట్ పొందిన చిత్రం. సెన్సార్ మెంబర్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ నెల 24న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

కృష్ణతేజ మాట్లాడుతూ.. భల్లాలదేవ టైటిల్ సినిమాకు యాప్ట్ అవుతుంది. కట్టప్ప అనే క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. మంచి కామెడీ సీన్స్ తో రూపొందిన చిత్రమిది. సినిమాలో మూడు పాటలుంటాయి. మొదట భాగం కథా పరంగా సాగుతూ రెండవ భాగం కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలతో రూపొందించారు.. అని చెప్పారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. రీమేక్ చేయడానికి దమ్మున్న కథ. అధ్బుతమైన లవ్ స్టొరీ ఇది. మంచి మాసివ్ ఫైట్స్ ఉంటాయి. మ్యూజిక్ చాలా బావుంది. సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పరుచూరి విజయలక్ష్మి, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: ఇమాన్, పాటలు: వనమాలి, మాటలు: కృష్ణతేజ, నిర్మాత: రావిపాటి సత్యనారాయణ, దర్శకత్వం: ఎలిళ్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ