Advertisementt

త్రివిక్రమ్ నూతన చిత్రం అ ఆ

Thu 10th Sep 2015 01:59 AM
aa aaa,trivikram new movie title,trivikram and nithiin movie,samantha,anasuya ramalingam vs anand vihari  త్రివిక్రమ్ నూతన చిత్రం అ ఆ
త్రివిక్రమ్ నూతన చిత్రం అ ఆ
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ నూతన చిత్రం అ ఆ

అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అన్నది ఉప శీర్షిక 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో  నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందించనున్న చిత్రం  పేరు ఇది. 

త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా  అనుపమ పరమేశ్వరన్ (మలయాళ చిత్రం ప్రేమమ్ఫేం) ను ఎంపిక చేశామని తెలిపారు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు). వరుసగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి  వంటి ఘన విజయం సాధించిన చిత్రాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వం లోనే తమ బ్యానర్ లో మూడవ చిత్రాన్ని నిర్మించటానికి సిద్ధమయ్యారు అభిరుచి గల నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు). 

సెప్టెంబర్ 3 వ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభ మవుతుందని, 2016 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం- అనిరుధ్, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్-రాజీవన్, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్, 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి.డి.వి.ప్రసాద్

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ