Advertisementt

ఆ సినిమా విజయ్‌కి బ్రేక్‌ అవుతుందట

Wed 09th Sep 2015 07:18 AM
tamil hero vijay latest movie puli,puli audio releasing on 19th sept,puli movie releasing on st october. puli movie director chimbu devan  ఆ సినిమా విజయ్‌కి బ్రేక్‌ అవుతుందట
ఆ సినిమా విజయ్‌కి బ్రేక్‌ అవుతుందట
Advertisement
Ads by CJ

ఇళయదళపతి విజయ్‌ హీరోగా ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై చింబుదేవన్‌ దర్శకత్వంలో చింబుదేవన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై సిబు థమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న భారీ చిత్రం పులి. ఈ చిత్రాన్ని ఎస్‌.వి.ఆర్‌.మీడియా ప్రై.లి.బ్యానర్‌పై సి.శోభ తెలుగులో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ సెప్టెంబర్‌ 19న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరగనుంది. 

ఈ సందర్భంగా హీరో విజయ్‌ మాట్లాడుతూ  తెలుగులో తుపాకి నాకు పెద్ద హిట్‌ అయింది. జిల్లా చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఈ సినిమా తెలుగులో నాకు పెద్ద బ్రేక్‌ అవుతుంది. తెలుగులో నాకు టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది. డైరెక్టర్‌ చింబుదేవన్‌ ఈ చిత్రాన్ని చాలా హై రేంజ్‌లో తీశారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది  అన్నారు. 

నటి శ్రీదేవి మాట్లాడుతూ  తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటించడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను తెలుగు సినిమాలో నటించాను. ఆమధ్య నేను హిందీలో నటించిన ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ చిత్రాన్ని తెలుగులోకి డబ్‌ చేస్తే ఇక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు పులి చిత్రం తెలుగులో నాకు మంచి రీ ఎంట్రీ మూవీ అవుతుంది అన్నారు. 

నిర్మాత సి.శోభ మాట్లాడుతూ  ఈనెల 19న శిల్పకళావేదికలో పులి ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. అక్టోబర్‌ 1న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాంఅన్నారు. 

విజయ్‌, శృతి హాసన్‌, హన్సిక, శ్రీదేవి, కన్నడ స్టార్‌ సుదీప్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రి తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కెమెరా: నటరాజన్‌ సుబ్రమణ్యం, ఎడిటింగ్‌: ఎ.శ్రీకర్‌ప్రసాద్‌, నిర్మాతలు: సి.శోభ, సిబు థమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌, రచన-దర్శకత్వం: చింబుదేవన్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ