Advertisementt

భలే భలే మగాడివోయ్ సక్సెస్ మీట్!

Wed 09th Sep 2015 05:59 AM
bhale bhale magadivoy,nani,lavanya tripati,allu aravind,maruthi  భలే భలే మగాడివోయ్ సక్సెస్ మీట్!
భలే భలే మగాడివోయ్ సక్సెస్ మీట్!
Advertisement

నాని, లావణ్య త్రిపాఠి జంటగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో జి.ఎ2, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై మారుతి దర్శకత్వంలో బన్నివాసు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం భలే భలే మగాడివోయ్‌.  సెప్టెంబర్‌ 4న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా... 

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. మారుతి నాకు చెప్పిన దాని కంటే సినిమా చూసినప్పుడు బాగా ఎంజాయ్‌ చేశాను. నాని ప్రస్తుతం ఉన్న నటుల్లో ఫైనెస్ట్‌ యాక్టర్‌. సినిమాల పట్ల చాలా కమిట్‌మెంట్‌ ఉన్న వ్యక్తి. ఈ సినిమాతో మారుతి తన సెకండ్‌ లెవల్‌లో ఫస్ట్‌ సక్సెస్‌ అందుకున్నాడు. లావణ్య చక్కగా నటించింది. తన నటన నచ్చడంతో అల్లు శిరీష్‌ సినిమాలో కూడా హీరోయిన్‌గా ఎంపికచేశాం. ఈ సినిమా టీం అంత సక్సెస్ కోసం చాలా కష్టపడింది.. అని అన్నారు. 

బన్నివాస్‌ మాట్లాడుతూ..ఈరోజుల్లో సినిమా షూటింగ్‌ టైమ్‌లో సినిమా చూసి ఇదేం హిట్టవుతుందనుకున్నాను. కానీ సినిమా పెద్ద సక్సెస్ అయింది. ఒక మనిషి గురించి తక్కువ అంచనా వేశానని అప్పుడు అనుకున్నాను. తన సినిమాలను నేను జడ్జ్ చేయలేను. ఈ సినిమాకు సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్.. అని చెప్పారు

మారుతి మాట్లాడుతూ.. నేను డైరెక్ట్‌ చేసిన కొత్త జంట అనుకున్న స్థాయిలో పెద్ద హిట్‌ కాలేదు. నా హోమ్‌ బ్యానర్‌లాంటి గీతాఆర్ట్స్‌లో ఓ హిట్‌ చేయాలని అనుకునేవాడిని. ఈ సినిమాతో నేను అనుకున్నది జరిగింది.  హీరో నాని ముఖ్యమైన సలహాలు ఇచ్చి సినిమా సక్సెస్‌ కావడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఓ మీడియం బడ్జెట్‌ మూవీ యు.ఎస్‌లో వన్‌ మిలియన్‌ డాలర్స్‌ కలెక్ట్‌ చేయడం చాలా గొప్ప విషయం. ఇంత మంచి విజయాన్ని నాకు అందించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు.. అని అన్నారు. 

నాని మాట్లాడుతూ.. నేను బిబిఎమ్‌ అంటే భలే భలే మగాడివోయ్‌ అని అనుకుంటే ప్రేక్షకులు మాత్రం బ్లాక్‌ బస్టర్‌ మూవీని చేసేశారు. సినిమా పెద్ద హిట్‌ అవుతుందనుకున్నాం. కానీ ఇంత పెద్ద హిట్‌ అవుతుందనుకోలేదు. ఆదరించి అభిమానిస్తున్న ప్రేక్షులకు నా థాంక్స్.. అన్నారు. 

ఈ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి, సుధీర్‌ బాబు, మధుమిత, శివబాలాజీ, నరేష్‌, ఎస్‌.కె.ఎన్‌, యు.వి.క్రియేషన్స్‌ వంశీ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement