తేజస్, చాందిని జంటగా వి.ఎస్.పి. తెన్నేటి సమర్పణలో వెంకటేష్ మూవీస్, 100 క్రోర్స్ అకాడమీ పతాకాలపై కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేష్ బాలసాని నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘కేటుగాడు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 18న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..
నిర్మాత వెంకటేష్ బాలసాని మాట్లాడుతూ.. సినిమా క్వాలిటీ పరంగా కంటెంట్ పరంగా చాలా బాగా వచ్చింది. నాకు చిన్నప్పటి నుండి సినిమా తీయాలనే కోరిక ఉండేది. 25 సంవత్సరాలుగా బిజినెస్ లోనే ఉన్నాను. రెండు సంవత్సరాల క్రితం కిట్టు నల్లూరి గారితో పరిచయం ఏర్పడింది. ఆయన చెప్పిన కథ నచ్చి కథపై, కిట్టు గారిపై నమ్మకంతో ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. ఇది మా ప్రొడక్షన్ లో మొదటి చిత్రం. ఈ సినిమాలో హీరో కార్లను దొంగిలించే పాత్రలో నటించాడు. తను ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. తన కోసం ఎలా మారాడనేదే ఈ సినిమా. అనుకున్న బడ్జెట్ కంటే సినిమాకు ఖర్చు ఇంకాస్త ఎక్కువయింది. మొదటి సినిమా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీయాలని నిర్మించాను. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో ఈ చిత్రాన్ని నేరుగా మేమే విడుదల చేస్తున్నాం. సుమారుగా 150 నుండి 200 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. సెప్టెంబర్ 18న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.
సంగీత దర్శకుడు సాయి కార్తిక్ మాట్లాడుతూ.. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ చిత్రమిది. డైరెక్టర్ రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా తీయడానికి ప్రయత్నించాడు. తేజకు ఈ సినిమాతో మంచి కమర్షియల్ హీరో అనే ఇమేజ్ వస్తుంది. ఈ సినిమాలో మొత్తం 5 పాటలున్నాయి. ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మెలోడీ సాంగ్ బావుందని చాలా మంది చెబుతున్నారు. ఈ సినిమాలో నాకు ఏమో ఏమైందో అనే పాట చాలా నచ్చింది. నెక్స్ట్ నేను దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో ఒక సినిమా, అనిల్ సుంకర గారి మూడు చిత్రాలకు, నార రోహిత్ రెండు చిత్రాలకు, వారాహి ప్రొడక్షన్స్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాను. తమిళంలో మ్యాన్ అనే ఓ సినిమాకు పని చేస్తున్నాను.. అని చెప్పారు.