Advertisementt

స్విమ్మింగ్ పూల్ ప్లాటినం డిస్క్ వేడుక!

Sun 06th Sep 2015 10:27 AM
swimming pool,arun kumar,manohar chimmani,akhil karthik  స్విమ్మింగ్ పూల్ ప్లాటినం డిస్క్ వేడుక!
స్విమ్మింగ్ పూల్ ప్లాటినం డిస్క్ వేడుక!
Advertisement
Ads by CJ

శ్రీ శ్రీ మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై అఖిల్‌కార్తీక్‌, ప్రియ వశిష్ట జంటగా శ్రీ శ్రీ మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై  మనోహర్‌ చిమ్మని దర్శకత్వంలో అరుణ్‌కుమార్‌ ముప్పన నిర్మించిన చిత్రం స్విమ్మింగ్‌పూల్‌. ఈ చిత్రం ఆడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని ప్లాటినం డిస్క్ వేడుకను నిర్వహించారు. ముప్పలనేని శివ ప్లాటినం డిస్క్ లను చిత్ర బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా..

దర్శకుడు మనోహర్‌ చిమ్మని మాట్లాడుతూ.. ఈ చిత్రంతో నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాం. ఈ రొమాంటిక్ హారర్ చిత్రం కోసం సిటీలో వివిధ లోకేషన్స్ తో పాటు, హైదరాబాద్ కు 55 కిలోమీటర్ల దూరంలో లో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో ఎక్కువ భాగం షూటింగ్ చేసాం. కథ డిమాండ్ ను బట్టి కొంత భాగాన్ని అమెరికాలో షూట్ చేసాం. సినిమాని 12రోజుల్లో పూర్తి చేశాం. ప్రదీప్‌చంద్ర మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. మంచి రీరికార్డింగ్‌ ఇచ్చారు. సినిమాని హారర్‌ ఎలిమెంట్స్‌తో, చక్కని కథతో తెరకెక్కించాం. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.. అని చెప్పారు.

నిర్మాత అరుణ్‌కుమార్‌ ముప్పన మాట్లాడుతూ.. ఇప్పుడు వస్తున్న రొటీన్ హారర్ చిత్రాలకు భిన్నమైన కథ, కథనాలతో ఒక ట్రెండీ రొమాంటిక్ హారర్ చిత్రంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఈ సినిమాను యు.కె, యు.ఎస్ లతో పాటు జర్మనీ లో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.

సంగీత దర్శకుడు ప్రదీప్‌చంద్ర మాట్లాడుతూ.. మంచి మ్యూజిక్‌, రీరికార్డింగ్‌ కుదిరింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్‌.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ముప్పలనేని శివ, ప్రియ వశిష్ట, రచ్చ రవి, సత్య దేవ్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వీరేంద్ర లలిత్, ఎడిటింగ్: రాజేష్, మ్యూజిక్: ప్రదీప్ చంద్ర, లిరిక్స్: తిరుపతి, ప్రొడ్యూసర్: అరుణ్‌కుమార్‌ ముప్పన, కథ-దర్శకత్వం: మనోహర్ చిమ్మని.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ