Advertisementt

రెడ్‌ అలర్ట్‌ ఆడియో విశేషాలు!

Thu 03rd Sep 2015 07:48 AM
red alert,chandramahesh,rana,mahadev,anjanamenon  రెడ్‌ అలర్ట్‌ ఆడియో విశేషాలు!
రెడ్‌ అలర్ట్‌ ఆడియో విశేషాలు!
Advertisement
Ads by CJ

హెచ్.హెచ్.మహాదేవ్, అంజనా మీనన్ జంటగా పి.ఎన్.త్రిలోక్ రెడ్డి సమర్పణలో సినీలయ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై చంద్రమహేష్ దర్శకత్వంలో పి.వి.శ్రీరాంరెడ్డి( లేట్) నిర్మించిన సినిమా రెడ్ అలర్ట్.  ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దగ్గుబాటి రానా బిగ్‌ సీడీ, ఆడియో సీడీలను, థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

రానా మాట్లాడుతూ.. శ్రీరామ్‌రెడ్డిగారు నాన్నగారికి మంచి స్నేహితుడు. వారి పరిచయంతో నేను ఇక్కడికి వచ్చాను. దక్షిణాది భాషల్లో రూపొందిన ఈ సినిమా ఆడియో, మూవీ పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు. 

లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఏకకాలంలో నాలుగు భాషల్లో చిత్రీకరించి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించారు. నిర్మాత శ్రీరామ్‌రెడ్డిగారు ఈరోజు మన మధ్య లేకపోయినా ఈ సినిమా రూపంలో బ్రతికే ఉన్నారు. ఈ సినిమా అన్ని బాషలలో పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు. 

స్వామిగౌడ్‌ మాట్లాడుతూ.. సినిమా టైటిల్‌ చాలా బావుంది. స్టొరీ కూడా బావుంటుందని భావిస్తున్నాను. చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌.. అని అన్నారు. 

డైరెక్టర్‌ చంద్రమహేష్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాని నాలుగు భాషల్లో తెరకెక్కించినందుకు రెండు అవార్డులు వచ్చాయి. ఆ క్రెడిట్‌ అంతా శ్రీరామ్‌రెడ్డిగారికే చెందుతుంది. ఈ అవార్డులను ఆయనకే అంకితం చేస్తున్నాను. రవివర్మ నాలుగు పాటలను చాలా డిఫరెంట్‌గా అందించాడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను కూడా అధ్బుతంగా ఉంటుంది. సుమన్‌గారు ఈ సినిమా కోసం ఎప్పుడు పడితే అప్పుడు డేట్స్‌ను కేటాయించి సపోర్ట్‌ చేశారు. సినిమాలో అందరూ చాలా నేచురల్‌గా నటించారు. సపోర్ట్‌ చేసిన నటీనటులు, టెక్నిషియన్స్‌కి థాంక్స్‌.. అని అన్నారు. 

హెచ్‌.హెచ్‌.మహాదేవ్‌ మాట్లాడుతూ.. ఆడియో బాగా వచ్చింది. రవివర్మగారు మంచి సంగీతాన్నందించారు. చంద్రమహేష్‌గారు చాలా కష్టపడి సినిమాని తెరకెక్కించారు. ఆయన డైరెక్షన్‌ లో పని చేయడం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. కన్నడ, మలయాళంలో విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళంలో త్వరలోనే విడుదల కానుంది. ఇక్కడ కూడా పెద్ద సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నాను.. అని అన్నారు. 

సంగీత దర్శకుడు రవివర్మ మాట్లాడుతూ.. రెడ్‌ అలర్ట్‌ చిత్రంతో నాలుగు భాషల్లో సినిమాని డైరెక్ట్‌ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అవకాశాన్ని నాకు కలిగించిన శ్రీరామ్‌రెడ్డిగారికి అలాగే  నాకు కావాల్సినంత ఫ్రీడవమ్‌ను ఇచ్చిన చంద్రమహేష్‌గారు ధన్యవాదాలు.. అని అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల పద్మారావు, తమ్మారెడ్డి భరద్వాజ, సుమన్‌, కవిత, జగదీష్‌ గౌడ్‌, సుధాకర్‌ కోమాకుల, మాదాల రవి, అంజనా మీనన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ జైపాల్‌రెడ్డి, కో ప్రొడ్యూసర్‌ పిన్నింటి శ్రీరాం సత్యారెడ్డి, వీర శంకర్‌, వెనిగళ్ళ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

సుమన్‌, కె.భాగ్యరాజ్‌, అలీ, పోసాని, వినోద్‌కుమార్‌, రవిప్రకాష్‌ తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీరామ్‌ చౌదరి, సంగీతం: రవివర్మ, కెమెరా: కళ్యాణ్‌ సమి, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు: వెనిగళ్ళ రాంబాబు, శ్రీరామ్‌ తపస్వి, శ్రీవల్లి, ఫైట్స్‌: హార్స్‌మెన్‌బాబు, జాషువ, ఆర్ట్‌: సాయిమణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: జైపాల్‌ రెడ్డి, కో ప్రొడ్యూసర్‌: పిన్నింటి శ్రీరాం సత్యారెడ్డి, ప్రొడ్యూసర్‌: పి.వి.శ్రీరామ్‌ రెడ్డి, స్కీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రమహేష్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ