Advertisementt

కుమారి 21ఎఫ్ స్టేటస్ ఏంటి?

Thu 03rd Sep 2015 06:45 AM
kumari 21f,kumari 21 f movie talkie part comple,sukumar kumari 21f movie,devisri prasad,ratnavelu  కుమారి 21ఎఫ్ స్టేటస్ ఏంటి?
కుమారి 21ఎఫ్ స్టేటస్ ఏంటి?
Advertisement
Ads by CJ

సుకుమార్ ‘కుమారి 21ఎఫ్’ టాకీపార్ట్ పూర్తి! 
వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న యువ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి ‘కుమారి 21 ఎఫ్’ పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా అందిస్తున్నాడు.  ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాలతో యూత్‌లో మంచి గుర్తింపును పొందిన  రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత కెరటం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, ఆర్య, రోబో, వన్, లింగా వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన రత్నవేలు ఈ చిత్రానికి ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం. సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీపార్ట్‌ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు సుకుమార్ మాట్లాడుతూ ‘ ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం. నేటి యూత్‌తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు ఇందులో వున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. రాజ్ తరుణ్ పాత్ర, అభినయం అందర్ని ఆకట్టుకునే విధంగా వుంటుంది’ అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘సుకుమార్ భాగస్వామ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించడమే ఆనందంగా వుంది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో రూపొందుతున్న చిత్రమిది. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది. రాజ్‌తరుణ్ కెరీర్ ఈ చిత్రం మరో మైలురాయిగా నిలుస్తుంది. సుకుమార్ మార్క్‌లో కొనసాగే ఈ ప్రేమకథా చిత్రం అన్ని వర్గాల వారిని ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్మకం వుంది. పాట మినహా చిత్రీకరణ పూర్తయింది.బ్యాలెన్స్ పాటను త్వరలోనే చిత్రీకరించి అక్టోబర్‌లో దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అని తెలిపారు. రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్, సమర్పణ: సుకుమార్,  నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి,కథస్కీన్‌ప్లే-మాటలు: సుకుమార్, దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్. 


Sukumar’s “Kumari 21 F” completes Talkie Part

 

Sukumar’s first film from his production house Sukumar Writings i.e., “Kumari 21 F” starring Raj Tarun, Hebah Patel in the direction of Palnati Surya Pratap has completed the talkie part of the shoot.

The unit has already completed filming four songs.

Apart from being the producer / presenter of the film, Sukumar has also written the story, screenplay and dialogues.

Palnati Surya Pratap, who assisted Sukumar in his earlier films, is the director of “Kumari 21 F”.

This film has cinematography by R Rathnavelu (of Arya, Robo, 1–Nenokkadine, Lingaa) and music is being composed by Devi Sri Prasad.

Devi Sri Prasad has composed superb songs and the unit has already completed filming four songs.

Sukumar Writings is producing “Kumari 21 F” in association with PA Motion Pictures Pvt Ltd. The film is being produced jointly by Sukumar, Vijaya Prasad Bandreddi and Thomas Reddy Aduri (of PA Motion Pictures Pvt Ltd)

The unit has kick started and is executing post production activities in full swing and the producers are gearing up for release during dasara season in October.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ