Advertisementt

కొబ్బరిమట్ట షూటింగ్ మొదలు

Wed 02nd Sep 2015 05:33 AM
kobbarimatta,sampoornesh babu,dasari narayanarao  కొబ్బరిమట్ట షూటింగ్ మొదలు
కొబ్బరిమట్ట షూటింగ్ మొదలు
Advertisement
Ads by CJ

సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం కొబ్బరిమట్ట. రూపక్ రొనాల్డ్ సన్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయంకానున్నాడు. గుడ్ సినిమా గ్రూప్ మరియు అమృత ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో  జరిగింది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లాప్ నివ్వగా, యువ దర్శకుడు మారుతి కెమెరా స్విచ్చాన్ చేసారు. ఈ సందర్భంగా..

దాసరి నారాయణరావు మాట్లాడుతూ... అసలు హీరో అయ్యేందుకు కావాల్సిన లక్షణాలు సంపూర్నేష్ బాబు లో లేకున్నా ఎటువంటి బ్యాగగ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగాడు. రవితేజ నటించిన ఇడియట్ సినిమాతో ఎవరు అమ్మానాన్నలతో వెటకారంగా మాట్లాడతారో.. ఎవరు ప్రేమించిన అమ్మాయిని ఏడిపిస్తాడో వారే హీరోల్లా ఫీల్ అవుతున్నారు. హృదయకాలేయం ట్రైలర్ చూసి ఇతను హీరో ఏంటి అనుకున్నాను. కానీ మొదటిరోజు కలెక్షన్స్ చూసి సంతోషంగా అనిపించింది. కొబ్బరిమట్ట పోస్టర్ చాలా బావుంది. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించాలని కోరుకొంటున్నాను.. అని అన్నారు. 

సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ... ఈ సినిమాలో పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడుగా మూడు పాత్రలో నటిస్తున్నాను. ఊరు మొత్తాన్ని చూసుకొనే పాపారాయుడు, 7 భార్యలు, 32 మంది పిల్లలు, 56 మంది మనవలు, మనవరాళ్లతో హాయిగా గడుపుతుంటాడు. మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తుండడం చాలా సంతోషంగా ఉంది.. అని అన్నారు. 

సాయి రాజేష్ మాట్లాడుతూ... హృదయకాలేయం తర్వాత సంపూతో సినిమా చేయాలనుకున్నాను. కాని  మంచు విష్ణు గారు సంపూతో సింగం123 చేస్తున్నానని చెప్పారు. మంచు ఫ్యామిలీతో సినిమా చేస్తే దాసరిగారికి దగ్గరవ్వచ్చనుకున్నాను. నేను వేరే ప్రాజెక్ట్ లో బిజీగా ఉండడం వల్లే కొబ్బరిమట్ట చిత్రం ద్వారా రూపక్ రొనాల్డ్ సన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను.. అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: కామ్రాన్, స్టంట్స్: స్టంట్ జాషువా, కథ, స్క్రీన్ ప్లే, మాటలు: స్టివెన్ శంకర్, ప్రొడ్యూసర్స్: సాయి రాజేష్ నీలం, ఆది కుంభగిరి, దర్శకత్వం: రూపక్ రొనాల్డ్ సన్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ