అశోక్, దిశా పాండే జంటగా సెకండ్ ఇండిపెండన్స్ టాకీస్ బ్యానర్ పై సాయిరాం చల్లా దర్శకత్వంలో ప్రభాకర్ రెడ్డి నిర్మించిన సినిమా కంట్రోల్ సి. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం.ఎం.కీరవాణి బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. టెక్ మహీంద్రకి చెందిన శ్రీరామ్, మూర్తి థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా..
యం.యం.కీరవాణి మాట్లాడుతూ.. అచ్చు మంచి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. తనకి మంచి ఫ్యూచర్ ఉంది. పాటలు వింటుంటే చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. సినిమా పెద్ద హిట్ కావాలి.. అని చెప్పారు.
కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ.. దర్శక నిర్మాతలతో పాటు హీరో హీరోయిన్లకి కూడా ఇది మొదటి సినిమా. వీరంతా భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు.
హీరో శివాజీ మాట్లాడుతూ.. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ నుండి సినిమాలపై ప్యాషన్‌తో వచ్చిన దర్శక నిర్మాతలకు అభినందనలు. ఈ చిత్రాన్ని చాలా కష్టపడి తీశారు. టైటిల్ చాలా బావుంది.. అని చెప్పారు.
శ్రీరామ్ మాట్లాడుతూ.. దర్శకుడు సాయిరామ్ చల్లా 21 సంవత్సరాలు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నారు. తనకి సినిమాలంటే చాలా ఆసక్తి. దాని కారణంగానే ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. డిఫరెంట్ జోనర్‌తో సాఫ్ట్‌వేర్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో మన ముందుకు సినిమాని తీసుకొస్తున్నారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి.. అన్నారు.
మూర్తి మాట్లాడుతూ.. సినిమాలపై ప్యాషన్‌తో దర్శక నిర్మాతలిద్దరూ ఈ రంగంలోకి ఎంటర్‌అయ్యారు. దర్శకుడు సాయిరామ్‌కి మంచి విజువలైజేషన్‌తో పాటు మంచి ఎగ్జిక్యూషన్ టాలెంట్ కూడా ఉంది. ఇండియాలో 9/11 దాడుల కాన్సెప్ట్‌తో వస్తున్న తొలి సినిమా ఇదే.. అని చెప్పారు.
నిర్మాత తాటిపర్తి ప్రభాకర్ మాట్లాడుతూ.. మనదేశం భవిష్యత్‌లో జీరో పర్సెంట్ క్రైమ్, హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ, డేడికేషన్, సెఫ్టీ, సూపర్ పవర్‌గా అవతరించాలనే కాన్సెప్ట్‌తో మా బ్యానర్‌కి సెకండ్ ఇండిపెండెన్స్ అనే టైటిల్‌ను పెట్టాం. ఇది హర్రర్ మూవీ కాదు. సస్పెన్స్‌తో భయాన్ని కలిగించే చిత్రం. ఈ జోనర్ మూవీ ఇప్పటి వరకు రాలేదు. కేవలం ఒక వర్గానికే పరిమితం కాకుండా పిల్లలు, ఫ్యామిలీ ఆడియెన్స్ సహా అందరికీ నచ్చే సబ్జెక్ట్. మా సినిమాలో పెద్ద స్టార్స్ లేకపోవచ్చు కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్ద సినిమాని నిర్మించాం. సుకుమార్‌గారు సెకండాఫ్ రషెష్ చూసి హాలీవుడ్ మూవీలా ఉందని అన్నారు. నేను, దర్శకుడు పదిహేనేళ్ళుగా మంచి మిత్రులం. సుకుమార్‌గారి సపోర్ట్‌తో ఈ రంగంలోకి ఎంటరయ్యాం. శ్రీధర్‌రెడ్డి, విజయ్‌మోహన్‌రెడ్డి తదితరులు సహకారం మరచిపోలేం. అచ్చు ఎక్సలెంట్ మ్యూజిక్‌నిచ్చాడు. దానికంటే బాగా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించాడు. తనకి స్పెషల్ థాంక్స్. హీరో హీరోయిన్లు మంచి పెర్‌ఫార్మెన్స్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో అందరికీ నచ్చే చిత్రమవుతుంది.. అన్నారు.
దర్శకుడు సాయిరామ్ చల్లా మాట్లాడుతూ.. మనం కంప్యూటర్ వాడేటప్పుడు చాలాసార్లు ఈ కంట్రోల్ సి ఉపయోగించుంటాం. దాన్నే టైటిల్‌గా పెట్టి చేసిన సినిమా. ఇదొక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ. ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు అక్కడ ఉన్న ఓ జంటకు సిడి దొరుకుతుంది. ఆ సిడి వారి జీవితాలలో ఎలాంటి రోల్ ప్లే చేసిందనేదే ఈ సినిమా కథ. కంప్యూటర్ చేసే హారర్ ఇది. అచ్చు అద్భుతమైన సంగీతాన్ని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించాడు. సినిమా తప్పకుండా అందరినీ థ్రిల్‌కి గురి చేస్తుంది.. అన్నారు.
ఈ చిత్రానికి ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, సాహిత్యం: శ్రీమణి, సంగీతం: అచ్చు, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీధర్ సనగాల, కో ప్రొడ్యూసర్: విజయ్ మోహన్ రెడ్డి బాతుల, ప్రొడ్యూసర్: తాటిపర్తి ప్రభాకర్ రెడ్డి, దర్శకత్వం: సాయిరామ్ చల్లా.