Advertisementt

'సాహసం శ్వాసగా సాగిపో' టీజర్ లాంచ్!

Sun 30th Aug 2015 01:28 PM
sahasam swasagaa sagipo,nagachaitanya,gautham menon  'సాహసం శ్వాసగా సాగిపో' టీజర్ లాంచ్!
'సాహసం శ్వాసగా సాగిపో' టీజర్ లాంచ్!
Advertisement
Ads by CJ

నాగ చైతన్య, మంజిమ జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహసం శ్వాసగా సాగిపో'.  కోన వెంకట్ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై యం.రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా శనివారం సాయంత్రం ట్రైలర్ ను  ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు టీజర్, ద్వారకా క్రియేషన్స్ లోగోను విడుదల చేశారు.

ఈ సందర్భంగా..

నాగ చైతన్య మాట్లాడుతూ "కాలేజీలో గౌతమ్ మీనన్ చిత్రాలు చూస్తూ పెరిగాను. ఆయన దర్శకత్వంలో హీరోగా నటించాలనే కల 'ఏ మాయ చేసావే' చిత్రంతో తీరింది. మరోసారి ఆయనతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.

గౌతమ్ మీనన్ మాట్లాడుతూ "ఇది యాక్షన్ చిత్రమైనా రెగ్యులర్ గా ఉండదు. కొంత విరామం తర్వాత యాక్షన్ చిత్రం చేస్తున్నాను. 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగం రెండు నెలల్లో పూర్తి చేస్తాం. మంచి కథ, పాటలు కుదిరాయి. మంజిమ చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది" అని అన్నారు 

కోన వెంకట్ మాట్లాడుతూ "చైతన్య పక్కింటి కుర్రాడి పాత్రలో నటించాడు. సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించినా రొటీన్ సినిమా అనే విమర్శలు ఎదుర్కొంటుంది. వాటన్నింటిని బ్రేక్ చేసే చిత్రమిది" అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, రేష్మ ఘటాల, సునీత తాటి, వెంకట్, డాన్ పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ