Advertisementt

'పులి' ఆడియో రిలీజ్ కు సిద్ధం!

Sat 29th Aug 2015 11:23 AM
puli,vijay,shobarani,sreedevi,chimbudevan  'పులి' ఆడియో రిలీజ్ కు సిద్ధం!
'పులి' ఆడియో రిలీజ్ కు సిద్ధం!
Advertisement
Ads by CJ

 

విజయ్, శ్రీదేవి, శ్రుతిహాసన్, హన్సిక ప్రధాన పాత్రల్లో చింబు దేవన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తమిళ  చిత్రం 'పులి'. ఈ చిత్రాన్ని ఎస్‌.వి.ఆర్‌. మీడియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై శోభారాణి తెలుగులో విడుదల చేయడానికి హక్కులను పొందారు. ఈ సినిమా ఆడియో వేడుకను సెప్టెంబర్‌ మొదటివారంలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా... 

నిర్మాత శోభారాణి మాట్లాడుతూ ''మా ఎస్‌.వి.ఆర్‌. మీడియా బేనర్‌లో ఎన్నో విభిన్నమైన సినిమాలు అందించడం జరిగింది. తమిళంలో 125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'పులి' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. విజయ్‌ ఇప్పటి వరకు నటించని సూపర్‌ హీరో రోల్‌లో నటిస్తున్నారు. ఇదొక మైథలాజికల్ మూవీ. మన తెలుగు కమెడియన్స్ కూడా ఈ సినిమాలో నటించారు. చాలా లాంగ్ గ్యాప్ తరువాత శ్రీదేవి గారు సౌత్ ఇండియా లో నటిస్తున్న చిత్రమిది. మహారాణి పాత్రలో ఆమె అధ్బుతంగా నటించారు. టెక్నికల్ గా హై వాల్యూడ్ సినిమా ఇది. శృతిహాసన్‌, హన్సికలు హీరోయిన్స్‌గా నటించారు. ఇటీవల విడుదల చేసిన పులి ట్రైలర్‌ 51 లక్షల మంది వ్యూవర్స్‌తో ఓ రికార్డ్‌ సృష్టించింది. తమిళంలో దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం ఇప్పటికే పెద్ద హిట్టయింది. తెలుగు ఆడియో విడుదలను సెప్టెంబర్‌ మొదటివారంలో ప్లాన్‌ చేస్తున్నాం. బాహుబలి, శ్రీమంతుడు సినిమాల తరహాలో గ్రాండియర్‌గా ఉండే సినిమా ఇది. ప్రతి ఒక టెక్నిషియన్‌ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసారు. కమల్‌ కన్నన్‌ గ్రాఫిక్స్‌, మనీష్‌ మల్హోత్రా కాస్ట్యూమ్స్‌ చాలా హైలైట్‌గా నిలుస్తాయి. మా సంస్థకు పేరు తెచ్చే సినిమా అవుతుంది'' అన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ