సూపర్‌స్టార్ మహేష్, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీమంతుడు. మైత్రి మూవీ మేకర్స్, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. బ్యానర్స్ పై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదలై మంచి సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది. సినిమా రిలీజ్ అయి మూడవవారం వారం దాటినా ఈరోజుకి కూడా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ ను పెంచడానికి చిత్ర బృందం సినిమా ఎడిటింగ్ లో తీసేసిన కొన్ని సీన్లను తిరిగి యాడ్ చేయనుంది. ఈ సందర్భంగా..
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ "ఈ సినిమా మూడవవారం కూడా స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. ఈ విజయానికి కారణమైన మైత్రి మూవీ మేకర్స్ వారికి ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు నా థాంక్స్. రివ్యూస్ అన్నింటిలో ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇప్పటివరకు రాలేదని రాసారు. దాంతో మాపై బాధ్యత మరింత పెరిగింది. అయితే 'శ్రీమంతుడు' థియేట్రికల్ ట్రైలర్ ఉన్న రెండు సీన్లను లెంగ్త్ కారణం తీయాల్సివచ్చింది. ఆ సీన్లను యాడ్ చేయమని మమ్మల్ని చాలా మంది అడిగారు. మాకు కూడా ఆ సీన్స్ ను యాడ్ చేస్తే ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తారనిపించింది. సెన్సార్ కంప్లీట్ చేసిన ఆ రెండు సీన్స్ రేపు సాయంత్రం నుండి(28-8-2015) అన్ని థియేటర్లలో ప్రదర్శింపజేస్తున్నాం" అని చెప్పారు.
నిర్మాత నవీన్ మాట్లాడుతూ "మా మొదటి సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ఇది. దీనికి కారకులైన మహేష్, కొరటాల శివ గారికి థాంక్స్. రాజకీయనాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, స్టార్స్ అందరూ ఈ చిత్రాన్ని చూసారు. ఈ వారంలో సచిన్ టెండూల్కర్ కూడా చూడనున్నారు" అని చెప్పారు.