టాటా మూవీస్ పతాకంపై ఒకేసారి రెండు చిత్రాలు ప్రారంభమయ్యాయి. ఇందుకు అంబర్‌పేటలోని రాణా ప్రతాప్ సింగ్ ఫంక్షన్ హాల్ వేదికైంది. గురువారంనాడు లాంఛనంగా ప్రారంభించిన ఈ చిత్రంలో చంద్రకాంత్ ఉమేష్, వర్శిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరిద్దరిపై ముహూర్తపుషాట్ చిత్రించారు. ప్రేమవేదంకు టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు టి.కృష్ణగౌడ్ క్లాప్ కొట్టగా, జిహెచ్‌ఎం.సి. కార్మిక విభాగం టిఆర్‌ఎస్ ఉపాధ్యక్షుడు అమరేశ్వర్ స్విచ్చాన్ చేశాడు. 'సూర్యనేత్రం'కు హైకోర్టు అడ్వకేట్ సాయికుమార్ స్విచ్చాన్ చేయగా, హైకోర్టు అడ్వకేట్ సంగం వెంకటేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాలకు దర్శకనిర్మాత వినోద్ వర్మ.
దర్శకనిర్మాత వినోద్ వర్మ మాట్లాడుతూ "23 ఏళ్ళుగా ఇండస్ట్రీలో పలు శాఖల్లో పనిచేసిన అనుభవం వుంది. స్నేహితులు, రావుగారి ప్రోత్సాహంతో రెండు చిత్రాలను రూపొందించే అవకాశం కల్గింది. 'ట్రూ టాలెంట్ ఆర్టిస్టులను' వెలుగులోకి తెచ్చేందుకు టాటా మూవీస్‌ను స్థాపించి కొత్తవారికి అవకాశం కల్పించాను. స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనంగా 'ప్రేమ వేదం' రూపొందిస్తుంటే, సామాజిక అంశాల్లోంచి చక్కటి అంశాన్ని 'సూర్యనేత్రం'గా తీసుకువస్తున్నాం. ఈరోజు లాంఛనంగా ప్రారంభించిన ఈ చిత్రాలను ఒకేసారి సెప్టెంబర్ 5నుంచి ప్రేమవేదం, సెప్టెంబర్ 10 నుంచి సూర్యనేత్రం రెగ్యులర్ షూటింగ్‌తో ఏకధాటిగా సాగే షెడ్యూల్తో పూర్తిచేస్తాం" అని చెప్పారు.
హీరో చంద్రకాంత్ మాట్లాడుతూ ''నటుడిగా అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్న వినోద్ వర్మ తన మామయ్య అనీ, మంచి కథాంశాన్ని తీసుకున్నారని తెలిపారు".
ఇప్పటివరకు తాను 12 సీరియల్స్‌లోనూ, 6 సినిమాల్లోనూ నటించాననీ, ఈ చిత్రంతో గుర్తింపు వస్తుందనే నమ్మకముందని హీరోయిన్ వర్శిత తెలిపింది. ఈ సందర్భంగా హాజరైన అతిథులు. వినోద్ వర్మ ప్రయత్నాన్ని అభినందిస్తూ... విజయవంతం కావాలని కోరారు. కొత్తవారితో తీస్తున్న ఈ చిత్రానికి కెమెరా, కథ, మాటలు, పాటలు, నిర్మాత, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వినోద్ వర్మ.