Advertisementt

'ది ఐస్' ఆడియో విడుదల!

Thu 27th Aug 2015 10:06 AM
the eyes,meerajasmin,venkatesh,kanishka,naveen yadav  'ది ఐస్' ఆడియో విడుదల!
'ది ఐస్' ఆడియో విడుదల!
Advertisement
Ads by CJ

మీరా జాస్మిన్, బద్రి, శంకర్ ప్రధాన పాత్రల్లో శాజియెం దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం 'ది ఐస్'. ఈ చిత్రాన్ని నిర్మాత డి.వెంకటేష్ డి.వి.క్రియేషన్స్ పతాకంపై తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో లాంచ్ బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నవీన్ కుమార్ యాదవ్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను టి.ప్రసన్న కుమార్ కు అందించారు. కనిష్క సంగీతం అందించిన ఈ ఆడియో మార్కెట్ లోకి విడుదలయ్యింది. ఈ సందర్భంగా..

మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క మాట్లాడుతూ "ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ అవ్వాలని చాలా జాగ్రత్తగా చేసాం. ఖచ్చితంగా సినిమా అందరికి నచ్చుతుంది" అని చెప్పారు.

నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ "సమాజం బాగుండాలని చాలా మంది కోరుకుంటారు కాని సమాజ సేవ చేయడానికి మాత్రం కొందరే ముందుకొస్తారు. ప్రస్తుతం భ్రూణహత్యలు అనేవి ఎక్కువైపోయిని. అందుకే వాటిపై ఓ ఏ.వి ను రెడీ చేసి నా ప్రతి సినిమా రిలీజ్ అయ్యే థియేటర్ లో ప్రదర్శించాలనుకుంటున్నాను. తద్వారా కొందరైనా మారుతారనే ఉద్దేశ్యంతో ఈ పని చేస్తున్నాను. ఇక సినిమా విషయానికొస్తే ఇదొక థ్రిల్లర్ మూవీ. 'గోల్డెన్ ఛాన్స్ టు ఆడియన్స్' అనే కాంటెస్ట్ నిర్వహించి ఈ చిత్రం చూసిన వారికి క్యాష్ ప్రైజెస్ ఇవ్వనున్నాం" అని చెప్పారు.

రామసత్యనారాయణ మాట్లాడుతూ "వెంకటేష్ గారు నాకు మంచి స్నేహితులు. రామ్ గోపాల్ వర్మ గారితో  కలిసి '365 డేస్' చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత పెద్ద వంశీ గారు తెరకెక్కించిన 'వెన్నెల్లో హాయ్ హాయ్' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన సైంటిఫిక్ థ్రిల్లర్ 'ది ఐస్'  చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు.  ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

టి.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ "గట్స్ ఉన్న నిర్మాత వెంకటేష్ గారు. మంచి సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధించి ఆయనకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పద్మిని, మానస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: కనిష్క, సినిమాటోగ్రాఫర్: చంద్రమౌళి, ఎడిటర్: నాగిరెడ్డి, డైరెక్టర్: శాజియెం, నిర్మాత: డి.వెంకటేష్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ