Advertisementt

ఈ సారి పక్కా అంటున్న మాలిని!

Wed 26th Aug 2015 10:10 AM
malini and co,poonam pandey,veeru,milan,kishore rathi  ఈ సారి పక్కా అంటున్న మాలిని!
ఈ సారి పక్కా అంటున్న మాలిని!
Advertisement
Ads by CJ

పూనమ్‌ పాండే, మిలన్  ప్రధాన పాత్రల్లో, మనీషా ఆర్ట్స్‌ అండ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై, కిషోర్‌ రాఠి సమర్పణలో, వీరు.కె దర్శకత్వంలో మహేష్‌ రాఠి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మాలిని అండ్‌ కో’. ఈ చిత్రం  సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్టు 28న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా..

పూనమ్ పాండే మాట్లాడుతూ "ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రంలో నేను నటించిన పాత్ర నా నిజ జీవితానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఇదొక మసాలా యాక్షన్ ఫిలిం. వీరు గారితో వర్క్ చేయడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. 28న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

మిలన్ మాట్లాడుతూ ’'ఈ సినిమా తీవ్రవాద నేపథ్యంలో యాక్షన్‌ మరియు రొమాంటిక్‌ జోనర్‌లో సాగుతుంది.   టాప్‌ టెక్నిషియన్స్‌ సపోర్ట్‌తో ఆరు పాటలు, బ్యాంకాక్‌, మలేషియాల్లో చిత్రీకరణ జరిపాం. ఇదొక మాస్ ఎంటర్టైనర్ సినిమా. కామెడీ, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకుల మన్ననలను పొందుతుందని ఆశిస్తున్నాము" అని అన్నారు.

వీరు కె మాట్లాడుతూ "చాలా సంవత్సరాల తర్వాత మనీషా సంస్థలో మళ్ళీ సినిమా వస్తోంది. ఒక సక్సెస్‌ఫుల్‌ సినిమాకి కావాల్సిన హంగులన్నీ ఈ సినిమాలో సమకూరాయి. యూత్ ఫాలోయింగ్ ఉన్న యాక్ట్రెస్ మాత్రమే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించగలరు. పూనమ్ పాండే ను ఈ సినిమాలో సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అదే. ఈ చిత్రంలో పూనమ్ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటు మరో తొమ్మిది భాషల్లో విడుదలవుతుంది" అని చెప్పారు.

పూనమ్‌పాండే, మిన్‌, సామ్రాట్‌, సుమన్‌, జాకీర్‌, రవి కాలే, జీవా, ఖుషీ, ఫరా, కావ్య, సాంబ, చిత్రం బాష తారాగణంగా నటించిన  ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్‌, డ్యాన్స్‌: ప్రేమ్‌రక్షిత్‌, తార, వినయ్‌, ఫైట్స్‌: విజయ్‌, సహ నిర్మాత: రవి హార్‌ కూట్‌, నిర్మాత: మహేష్‌ రాఠి, సంగీతం, దర్శకత్వం: వీరు.కె.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ