Advertisementt

ఈ 'భల్లాలదేవ' సంగతేంటి!

Tue 25th Aug 2015 08:24 AM
bhallaladeva,vimal,bindu madhavi,ravipati sathyanarayana  ఈ 'భల్లాలదేవ' సంగతేంటి!
ఈ 'భల్లాలదేవ' సంగతేంటి!
Advertisement
Ads by CJ

విమల్, బిందు మాధవి జంటగా సత్యదేవ పిక్చర్స్ బ్యానర్ పై రావిపాటి సత్యనారాయణ అందిస్తున్న చిత్రం 'భల్లాలదేవ'. ఈ చిత్రం టీజర్ లాంచ్ మంగళవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. కోదండరామిరెడ్డి టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా..

కోదండరామి రెడ్డి మాట్లాడుతూ "తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని సత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఇది. ఖచ్చితంగా తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుంది" అని చెప్పారు.

కృష్ణతేజ మాట్లాడుతూ "ఈ సినిమాలో మూడు పాటలున్నాయి. వనమాలి గారు మంచి సాహిత్యాన్నందించారు. మంచి క్వాలిటీతో ఈ సినిమా చేసారు. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది" అని చెప్పారు.

వనమాలి మాట్లాడుతూ "సినిమాలో మంచి పాటలున్నాయి. ఇమాన్ అందించిన ఈ చిత్రంలో పాటలు రాయడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. తమిళంలో రెండు పాటలు పెద్ద హిట్ అయ్యాయి. తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాను" అని చెప్పారు.

రావిపాటి సత్యనారాయణ మాట్లాడుతూ "ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రఖ్యాత నిర్మాత మదన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మాతృక 'దేసింగు రాజా' తమిళ్ లో సూపర్ హిట్ అయి నూరు రోజులు ప్రదర్శించబడింది. ఈ సినిమాలో విమల్, బిందు పోటీ పడి నటించారు. ఈ చిత్రానికి 'భల్లాలదేవ' టైటిల్ యాప్ట్ అవుతుంది. ఇమాన్ అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చిత్ర ఆడియోను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: ఇమాన్, పాటలు: వనమాలి, మాటలు: కృష్ణతేజ, నిర్మాత: రావిపాటి సత్యనారాయణ, దర్శకత్వం: ఎలిళ్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ