Advertisementt

నితిన్ కెరీర్ లో బెస్ట్ ఫిలిం అవుతుందంట!

Mon 24th Aug 2015 06:12 AM
courier boy kalyan,nithin,gautham menon,prem sai  నితిన్ కెరీర్ లో బెస్ట్ ఫిలిం అవుతుందంట!
నితిన్ కెరీర్ లో బెస్ట్ ఫిలిం అవుతుందంట!
Advertisement
Ads by CJ

నితిన్, యామీగౌతమ్ జంటగా ఫోటాన్ కతాస్ బ్యానర్ పై ప్రేమ్ సాయి దర్శకత్వంలో గౌతంమీనన్ నిర్మిస్తున్న సినిమా 'కొరియర్ బోయ్ కళ్యాన్'. ఈ  చిత్రం ఆడియో లాంచ్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుధాకర్ రెడ్డి ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అఖిల్ అక్కినేని థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా..

కోనవెంకట్ మాట్లాడుతూ "బాహుబలి చిత్రం కంటే మా సినిమా ఎక్కువ సమయం తీసుకుంది. ఇది మా బాహుబలి. ప్రపంచంలో ఉండే ప్రతి ఇద్దరి వ్యక్తులను ఒక బంధం కలుపుతుంది. నితిన్ నేను పవన్ కళ్యాన్ అభిమానులం. డైరెక్టర్ ప్రేమ్ సాయి నేను ఒకే ఊరివాళ్ళం. అలానే గౌతం నేను సినిమాలను ఎక్కువగా ప్రేమిస్తాం. మా అందరిని కలిపిన బంధమిది. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి నిమిషం ఎక్సైట్మెంట్ తో నడుస్తుంది. నితిన్ కెరీర్ లో బెస్ట్ ఫిలిం ఇది" అని చెప్పారు.

గౌతంమీనన్ మాట్లాడుతూ "తెలుగులో ప్రొడ్యూసర్ గా చేస్తున్న మొదటి సినిమా ఇది. ప్రేమ్ సాయి ఇన్స్పైరింగ్ స్టొరీ చెప్పాడు. సుధాకర్ రెడ్డి గారు మంచి సహకారం అందించారు. ఆయన వలనే మా సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది. ప్రతి ఒక్కరికి కష్టాలనేవి తప్పవు. ఆలానే మా సినిమాకు కూడా కొన్ని కష్టాలు వచ్చాయి. అందుకే రిలీజ్ కు లేట్ అయింది. ఈ సినిమాలో కార్తిక్ మూడు పాటలను అనూప్ ఒక పాటను స్వరపరిచారు" అని చెప్పారు.

ప్రేమ్ సాయి మాట్లాడుతూ "గౌతం గారితో పని చేయడం ఓ వరం. చాలా ఫ్రీడమ్ ఇస్తారు. కార్తిక్ మంచి మ్యూజిక్ ఇచ్చారు" అని చెప్పారు.

నితిన్ మాట్లాడుతూ "దాదాపు మూడు సంవత్సరాల తరువాత ఈ సినిమా రిలీజ్ అవుతుంది. నాకు బాగా దగ్గరయిన చిత్రమిది. ఇష్క్ సినిమా తరువాత నేను చాలా కథలు విన్నాను. కాని నాకేవి నచ్చలేదు. గౌతం గారు స్టొరీ చెప్పినప్పుడు సినిమా చేయకూడదనే విన్నాను. విన్న తరువాత కథ బాగా నచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కష్ట సమయం ఉంటుంది. ఇష్క్ సినిమా ముందు వరకు నాకు కష్ట సమయం గడిచింది. మూడు సంవత్సరాల నుండి రేష్మ, గౌతంమీనన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. నూటికి నూరు శాతం ఇది కొత్త సినిమా. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గౌతంమీనన్, ప్రేమ్ సాయి కూడా ఈ సినిమా హీరోలే. ప్రేమ్ కు ఈ సినిమాతో మంచి టైం స్టార్ట్ అవుతుంది" అని చెప్పారు.

నాగచైతన్య మాట్లాడుతూ "రెగ్యులర్ సినిమాలా కాకుండా ట్రెండ్ ను సెట్ చేసే సినిమా ఇది. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో నితిన్ ముందుంటాడు. ప్రేమ్ సాయి చిత్రాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. సినిమా బాగా వచ్చింది. మ్యూజిక్ బావుంది" అని చెప్పాడు.

అఖిల్ మాట్లాడుతూ "గౌతం డైరెక్ట్ చేసే ప్రతి సినిమాలో మంచి స్టొరీ ఉంటుంది. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో కూడా మంచి కథ ఉంటుందని భావిస్తున్నాను. ట్రైలర్స్ చూస్తుంటే నితిన్ నటనలో కొత్తదనం కనిపిస్తుంది. మూడు సంవత్సరాలుగా ఈ సినిమాపై చాలా పాజిటివ్ గా ఉన్నాడు. నితిన్ కెరీర్ లో ఈ సినిమా పెద్ద హిట్ గా నిలుస్తుంది" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రానా, నాని, వెంకటరత్న సుందరం, తాటి సునీత, రేష్మ, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ