Advertisementt

చిరు.. బాలయ్య.. చెర్రీ.. బ‌న్నీ... డ్యాన్సులే డ్యాన్సులు!

Mon 24th Aug 2015 04:29 AM
chiranjeevi 60th birthday party,chiranjeevi,balakrishna,ram charan,bunny,sai dharam tej,  చిరు.. బాలయ్య..  చెర్రీ.. బ‌న్నీ... డ్యాన్సులే డ్యాన్సులు!
చిరు.. బాలయ్య.. చెర్రీ.. బ‌న్నీ... డ్యాన్సులే డ్యాన్సులు!
Advertisement
Ads by CJ
చిరంజీవి 60వ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని నిన్న‌నే హైద‌రాబాద్‌లో మెగా సంబ‌రం జ‌రిగింది. ఆ సంబ‌రానికి తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం... ఇలా భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌న్నింటి నుంచీ తార‌లు వ‌చ్చారు. రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు. అంద‌రూ రాడేమో అనుకొన్నారు కానీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా వ‌చ్చేశాడు. దీంతో పార్టీ క‌ళ‌క‌ళ‌లాడిపోయింది. స‌ల్మాన్‌ఖాన్‌, అభిషేక్‌బ‌చ్చ‌న్‌, వివేక్ ఒబెరాయ్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లాంటి న‌టులు పార్టీకి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. వేడుక‌లో రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ క‌లిసి వేసిన డ్యాన్సులు అదిరిపోయాయ‌ట‌. వాళ్ల ఉత్సాహాన్ని చూసి చిరంజీవి కూడా కాలు క‌దిపాడట. అక్కడే ఉన్న బాలకృష్ణ కూడా చిరుతోపాటు స్టేప్పులేసి అదరగొట్టాడట.  అది చూసి అతిథులంతా ప్రేక్ష‌కుల్లా మారి ఈల‌లు వేస్తూ గోల  గోల చేశార‌ట‌. చాలామంది సెల‌బ్రిటీలు ట్విట్ట‌ర్‌లో ``చిరులోని అస‌లు సిస‌లైన డ్యాన్స‌ర్‌ని నిన్న రాత్రి మ‌ళ్లీ చూశాం`` అని ట్వీట్లు చేస్తున్నారు. మొత్తంగా మెగాస్టార్ రీ ఎంట్రీకి ప‌క్కాగా సిద్ధ‌మైపోయాడ‌ని అర్థ‌మైంది. అతిథులంతా చిరుకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌తో పాటు వెల్క‌మ్ బ్యాక్ అంటూ మ‌ళ్లీ ప‌రిశ్ర‌మ‌కి స్వాగ‌తించార‌ట‌. ఈ ఉత్సాహంలో చిరు బాక్సాఫీసుని బ‌ద్ద‌లు చేస్తాడ‌న‌డంలో సందేహమే లేదు. అన్న‌ట్టు చిరంజీవి త‌న సినిమా గురించి కూడా రెండు మూడు రోజుల్లోనే ఓ ప్ర‌క‌ట‌న చేయొచ్చ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ