Advertisementt

'కృష్ణమ్మ కలిపింది..' ఫీల్ గ్రేట్ మూవీ అంట!

Fri 21st Aug 2015 09:02 AM
krishnamma kalipindi iddarinee,lagadapati sreedhar,trinadharao  'కృష్ణమ్మ కలిపింది..' ఫీల్ గ్రేట్ మూవీ అంట!
'కృష్ణమ్మ కలిపింది..' ఫీల్ గ్రేట్ మూవీ అంట!
Advertisement
Ads by CJ

సుధీర్‌బాబు, నందిత హీరోహీరోయిన్లుగా రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ఆర్‌.చంద్రు దర్శకత్వంలో శ్రీమతి, శ్రీ లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. జూన్ 19న విడుదలయిన ఈ చిత్రం ఆగస్ట్ 7 నాటికి యాభై రోజులు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా చిత్రబృందం శుక్రవారం హైదరాబాద్ లోని యాభై రోజుల వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీసెంట్ గా విడుదలయ్యి మంచి హిట్ సాధించిన 'సినిమా చూపిస్త మావ' చిత్ర యూనిట్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.వి.కృష్ణారెడ్డి, బెక్కం వేణుగోపాల్, త్రినాధరావు నక్కిన, మధురాశ్రీధర్ రెడ్డి, లగడపాటి శ్రీధర్   తదితరులు పాల్గొన్నారు.

ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ "ఓ హిట్ సినిమా విజయోత్సవ వేడుకలో మరో హిట్ సినిమా చిత్ర బృందాన్ని సత్కరించడం ఇదే మొదటిసారి. ఇదొక గొప్ప విషయం. ఇక 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' సినిమా విషయానికొస్తే సెంటిమెంట్ తో ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసే చిత్రం. అధ్బుతమైన మ్యూజిక్ తో సినిమా ఇంకా బాగా ఆడింది. కన్నడ చిత్ర కథను తెలుగులో తెరకెక్కిస్తే విజయం సాధించే అవకాశాలు చాలా అరుదు. వాళ్ళ నేటివిటీకు మనకు డిఫరెన్స్ ఉంటుంది. లగడపాటి మాత్రం కన్నడ సినిమా స్టొరీ తీసుకొని అక్కడ డైరెక్ట్ చేసిన దర్శకుడితోనే తెలుగులో కూడా సినిమా చేసి హిట్ కొట్టాడు. ఈరోజు ఈ చిత్రం యాబై రోజులు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది" అని చెప్పారు.

లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ "చిన్న చిత్రాల సత్తా చూపించిన దర్శకుడు కృష్ణారెడ్డి గారంటే నాకు గౌరవం. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అభిమానులకు నా ధన్యవాదాలు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ తమ సొంత సినిమాలా ఈ చిత్రం కోసం కష్టపడి పని చేసారు. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా స్పెషల్ థాంక్స్. మా చిత్రమే కాకుండా మరో చిన్న సినిమా తీసి హిట్ కొట్టిన 'సినిమా చూపిస్త మావ' చిత్ర బృందం తో మా టీమ్ కు అవార్డ్స్ ఇప్పించడం ద్వారా వారికి మరింత ప్రోత్సాహం కలిగించొచ్చని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. నా కొడుకు సినిమాల్లో నటించాలనుకుంటున్నాడు. సినిమా చూపిస్త మావ డైరెక్టర్ త్రినధరావు మంచి స్క్రిప్ట్ చెప్తే వారి బృందంతో సినిమా చేయాలనుకుంటున్నాను" అని చెప్పారు.

త్రినధరావు నక్కిన మాట్లాడుతూ "కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమా చూసాను. మంచి ఫీల్ గుడ్ మూవీ. వారి సక్సెస్ ఫంక్షన్ కు మమ్మల్ని అతిథులుగా పిలిచి సత్కరించాలనుకోవడం ఇండస్ట్రీలో అందరూ యూనిటీగా ఉండాలనేదానికి పునాది" అని చెప్పారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ