Advertisementt

ఆ కాంప్లిమెంట్ మర్చిపోలేను-మహేష్ బాబు!

Fri 21st Aug 2015 08:40 AM
sreemanthudu,thanks meet,mahesh babu,koratala siva  ఆ కాంప్లిమెంట్ మర్చిపోలేను-మహేష్ బాబు!
ఆ కాంప్లిమెంట్ మర్చిపోలేను-మహేష్ బాబు!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీమంతుడు. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌ పై ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్ 7న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో అభిమానుల సమక్షంలో చిత్ర బృందం థాంక్స్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా..

మహేష్ బాబు మాట్లాడుతూ "రెండు వారాల నుండి చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో మర్చిపోలేని రోజులివి. సినిమాలో నటించిన ప్రతి ఆరిస్ట్ కు నా అభినందనలు. ఈ సినిమాకు నేను కాకుండా మరో హీరో ఎవరైనా ఉన్నారంటే అది దేవినే. సెన్సేషనల్ మ్యూజిక్ ఇచ్చాడు. దేవిశ్రీ ఈ సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నా ఫేవరెట్. ఈ చిత్ర నిర్మాతలు మొదటి చిత్రమే ఇంత గొప్ప సినిమా చేసారు. మరిన్ని గొప్ప చిత్రాలు చేయాలని ఆశిస్తున్నాను. నా కెరీర్ లో చాలా ఇంపార్టంట్ మూవీ  'శ్రీమంతుడు'. ఇలాంటి మంచి కథతో సినిమా చేసిన కొరటాల శివ గారికి స్పెషల్ థాంక్స్. కాకినాడ లో చిన్నపిల్లాడికి ఆరోగ్యం బాలేదని నన్ను మీట్ అవ్వాలనుకుంటున్నాడని తెలిసి అతన్ని కలిసాను. ఆ పిల్లాడు 'శ్రీమంతుడు' సినిమా చూసాను. 'ఇట్స్ మార్వెలెస్' అని చెప్పాడు. బెస్ట్ కాంప్లిమెంట్ అది. ఎప్పటికి మర్చిపోలేను. నాన్నగారికి ఎంత మంచి ఫ్యాన్స్ ఉన్నారంటే సినిమా బాగోకపోతే తిట్టేది వాళ్ళే.. అలానే బావుంటే ఒక రేంజ్ లో సినిమాను పెట్టేది వాళ్ళే. అంత మంచి అభిమానులు నాక్కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పారు.

కొరటాల శివ మాట్లాడుతూ "మహేష్ తో కలిసి ఓ సోల్ ఫుల్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాను. కథ రెడీ చేసుకున్న వెంటనే మహేష్ గారిని కలిసాను. ఆయనకు చెప్పడానికి నాకు చాలా టెన్షన్ వచ్చింది. ఒప్పుకుంటారో లేదో అనే సందేహం కలిగింది. కాని కథ విన్న వెంటనే ఆయన సినిమా చేయడానికి ఓకే చెప్పారు. 'శ్రీమంతుడు' కథను నా కంటే ఎక్కువగా ప్రేమించింది మహేష్ గారే. అందుకే బెస్ట్ అవుట్ పుట్ వచ్చింది. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఆర్టిస్ట్ కు, టెక్నీషియన్ కు థాంక్స్. అందరూ ఇన్వాల్వ్ అయ్యి పని చేసారు. చిత్ర నిర్మాతలకు మొదటి సినిమా అయినా చాలా ఓపికగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీసారు. సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండి ప్రేక్షకులు నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఆడియన్స్ కు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ "ఈ సినిమాలో నన్ను భాగస్వామిని చేసిన కొరటాల శివ గారికి థాంక్స్. ప్రొడ్యూసర్స్ అందరికి నా అభినందనలు. మహేష్ స్టార్ మాత్రమే కాదు గొప్ప వ్యక్తి. ఎవరు ఏ చిన్న మంచి పని చేసిన అప్రిషియేట్ చేస్తారు. ఆయన అభిమానులంతా సినిమాను మళ్ళీ మళ్ళీ చూసి బ్లాక్ బాస్టర్ హిట్ చేసారు" అని చెప్పారు.

నిర్మాత నవీన్ మాట్లాడుతూ "ఈ సినిమా సక్సెస్ తో వచ్చిన హ్యాపీనెస్ ఎప్పుడు రాలేదు. మా బ్యానర్ లో మొదటి సినిమా కొరటాల శివ, మహేష్ బాబు గారితో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఆర్టిస్ట్ కు, టెక్నీషియన్స్ కు థాంక్స్" అని చెప్పారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "తెలుగు సినిమా పరిశ్రమలో చాలా రకాల సినిమాలు వచ్చాయి. కాని కొన్ని చిత్రాలు మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరో అనేవాడు పాజిటివ్ గా ఉండేవాడు. ఆ ఇంపాక్ట్ ప్రజల మీద బాగా ఉండేది. ఆ తరువాత పాజిటివ్ గా ఉండే చిత్రాలు చాలా అరుదుగా వచ్చాయి. కొరటాల శివ ఓ అధ్బుతమైన కథను రాసుకొని 'శ్రీమంతుడు' లాంటి గొప్ప సినిమా చేసాడు. ఈరోజు ఈ చిత్రం మాయలు మంత్రాలు చేసే చిత్రాలను తలదన్ని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. హీరోయిజం అనేదానికి కొత్త ట్రెండ్ సృష్టించింది 'శ్రీమంతుడు' చిత్రం. మహేష్ లాంటి ఓ అధ్బుతమైన నటుడ్ని సినిమాలో చూసాం" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వై.రవిశంకర్, సి.వి.మోహన్. ఎమ్.పి రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, రాహుల్, సితార, రామజోగయ్య శాస్త్రి, ఏ.ఎస్.ప్రకాష్. బి.ఏ.రాజు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ