Advertisementt

ఇప్పుడు రవితేజ కూడా మొదలెట్టాడు.!

Thu 20th Aug 2015 02:01 AM
raviteja latest movie kick 2,kick 2 releasing on 21st august,kick 2 director surender reddy,kick 2 producer kalyan ram,rakul preet in kick 2  ఇప్పుడు రవితేజ కూడా మొదలెట్టాడు.!
ఇప్పుడు రవితేజ కూడా మొదలెట్టాడు.!
Advertisement
Ads by CJ

ఫ్యాన్స్‌ కోసం అర్థరాత్రి నుంచి స్పెషల్‌ షోలు వేయడం, ఫ్యాన్స్‌ కూడా రెట్టించిన ఉత్సాహంతో తమ అభిమాన హీరో సినిమాని రిలీజ్‌ కంటే ముందే చూసేస్తున్నారు. స్టార్‌ హీరోల సినిమాలకు ఈ సందడి ఎలాగూ వుంటుంది. ఈమధ్య 'బాహుబలి' పుణ్యమాని అది కాస్త ఎక్కువే అయింది. ఆ సినిమా స్పెషల్‌ ప్రివ్యూలు చాలా వేశారు. తద్వారా షోలు వేసిన వారికి భారీగానే లాభాలు వచ్చాయి. ఆ తర్వాత 'శ్రీమంతుడు' చిత్రానికి కూడా అదే వరసలో ప్రివ్యూ షోలు వేశారు. 

ఇదిలా వుంటే ఆ దారిలో ఇప్పుడు రవితేజ కూడా వెళ్తున్నాడు. ఆరు సంవత్సరా క్రితం వచ్చిన 'కిక్‌' ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌ కాకపోయినా 'కిక్‌2' పేరుతో వస్తున్న రవితేజ లేటెస్ట్‌ మూవీ ఆగస్ట్‌ 21న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ చిత్రాన్ని హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మించడం ఒక విశేషం కాగా, 'కిక్‌'తో తెలుగులో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయమైన థమన్‌ మరోసారి 'కిక్‌2'కి తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశాడు. పాటలు ఆల్రెడీ పెద్ద హిట్‌ కావడం, బాహుబలి తర్వాత సినిమాలన్నీ వరస విజయాలు సాధిస్తుండడంతో 'కిక్‌2' కూడా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకంతో వున్నారు దర్శకనిర్మాతలు. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఆగస్ట్‌ 21 తెల్లవారు ఝామున 5 గంటలకు కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో అభిమానుల కోసం ప్రివ్యూను వేస్తున్నారు. మరి ఈ ప్రివ్యూకి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ