Advertisementt

'ప్రేమిక' సినిమా ప్రారంభం!

Thu 20th Aug 2015 01:59 AM
mahindra,premika,pawan,shankar,monika,lishitha  'ప్రేమిక' సినిమా ప్రారంభం!
'ప్రేమిక' సినిమా ప్రారంభం!
Advertisement
Ads by CJ

మహీంద్రా, పవన్, శౌర్య, లిషిత, జనని, మోనికా ప్రధాన పాత్రల్లో మౌంటెన్ మూవీస్ పతాకంపై మహీంద్రా దర్శకత్వంలో శంకర్, వెంకట కృష్ణ, లక్ష్మయ్య సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'ప్రేమిక'. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక బుధవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లోని జరిగింది. ఈ సందర్భంగా..

చిత్ర దర్శకుడు మహీంద్రా మాట్లాడుతూ "ముగ్గురు జంటల మధ్య విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ ప్రేమ కథను చిత్రంగాగా రూపొందిస్తున్నాం. భద్రాచలంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. సెప్టెంబర్ 5 నుండి రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నాం. శంషాబాద్ దగ్గరలో ఓ విలేజ్ లో, పూణే లోని ఖండాలా, బెంగుళూరు తదితర ప్రదేశాలలో షూటింగ్ జరపనున్నాం. మొత్తం నలబై రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేస్తాం" అని చెప్పారు.

నిర్మాతల్లో ఒకరైన శంకర్ మాట్లాడుతూ "మహీంద్రా కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. నా తోటి నిర్మాతలతో కలిసి సినిమాను నిర్మిస్తున్నాను. అందరు సహకరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

సంగీత దర్శకుడు దిలీప్ భండారి మాట్లాడుతూ "నేను రెండు ఆల్బమ్స్ చేసాను. అవి నచ్చడంతో నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. మొత్తం సినిమాలో తొమ్మిది పాటలున్నాయి. రికార్డింగ్ కంప్లీట్ అయింది. ఇది ఓ మంచి లవ్ స్టొరీ. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది" అని చెప్పారు.

పవన్ మాట్లాడుతూ "ఈ సినిమాలో లీడ్ పాత్రలో నటిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో కవిత, శివపార్వతి, లిషిత, జానకి, మోనికా, రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: దిలీప్ భండారి, ఫోటోగ్రఫీ: రాహుల్ మాచినేని, కథ: మహీంద్రా, నిర్మాతలు: శంకర్, వెంకట కృష్ణ, లక్ష్మయ్య, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: మహీంద్రా.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ