సొగసు చూడ తరమా అన్న పొగడ్త ఆడవాళ్లకే వర్తిస్తుంది కానీ ఆ సొగసును అక్షరాల్లో వర్ణించాలంటే అనుష్క అందాన్ని చూపిస్తే సరిపోతుందేమో. అంతటి అనుష్క, ఓసారి బాహుబలిలో దేవసేనగా మాసిపోయిన చీర కట్టి అభిమానులను నిరాశపరిచింది. సర్లే పాత్రకు తగ్గట్టు చేసిందని అభిమానులు ఊరట చెందినా అమ్మడు మాత్రం మళ్ళీ మరోసారి ఫ్యాన్సును డిసప్పాయింట్ చేసేట్టుంది. సైజ్ జీరో అనే కొత్త చిత్రం కోసం అనుష్క క్వింటాల్ బరువున్న లావుపాటి అమ్మాయిగా దర్శనం ఇచ్చేసింది. అసలు అనుష్క అంటేనే సరసమైన శరీర సౌష్టవంతో మగాళ్ళని కిక్కెక్కించే హాట్ బ్యూటీ. వయసు మీద పడుతున్నా దాని ప్రభావం బాడీ మీద ఎంత మాత్రం పడకుండా జాగ్రత్త పడుతూ తోటి హీరోయిన్లను వెనకకు నెట్టిన ఇంతటి ముగ్ధమనోహరి ఇలా వికృత రూపాల్లో నటించడం, అదీ బ్యాక్ టు బ్యాక్ చేయడంతో ఆమె అందానికి ఆరాధకులు తగ్గుతారేమో అన్న మీమాంస సినీ వర్గాల్లో వినబడుతోంది. ఏముందిలే బాహుబలి 2 వచ్చేస్తే అన్ని సర్దుకుంటాయి అంటారా... అయితే ఓకే.