క్రేజీ హీరో ఉపేంద్ర సినిమాలంటే జనానికి ఓ ప్రత్యేకమైన పిచ్చి. తనకంటూ స్పెషల్ ఇమేజిని సాధించుకుని హీరో నుండి దర్శకుడిగా ఎదిగిన ఉపేంద్ర కొత్త కన్నడ బాష సినిమా ఉప్పి 2, తెలుగులో ఉపేంద్ర 2గా విడుదలైంది. సైకలాజికల్ కథతో బుర్రకు పదును పెట్టె కథా కథనంతో మన ముందుకు వచ్చిన ఈ ఉప్పి తెలుగులో చప్పగా తేలిపోయింది. కానీ కన్నడ ప్రేక్షకులు మాత్రం ఉప్పి 2ని వసూళ్ళ ఉప్పెనలో ముంచెత్తుతున్నారు. శాండల్ వుడ్ లెక్కల ప్రకారం ఉప్పి 2 రెండు రోజుల్లో పదిహేను కోట్లు సాధించి కన్నడ రికార్డులకు చుక్కలు చూపుతోంది. గత కొద్ది రోజులుగా అన్ని భాషలలోను బాహుబలి హవా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఉప్పి 2 మాత్రం బాహుబలి కలెక్షన్లకు ఎసరు పెట్టె విధంగా కర్ణాటకలో ఊపేస్తోంది. అప్పుడే ఉపేంద్ర అభిమానులు రెండో సారి, మూడో సారి సినిమా చూడడానికి ఎగబడుతున్నారంటే తుప్పు లేపుతున్నట్టే కదా.