Advertisementt

దానికి కమల్ హాసన్.. దీనికి శృతిహాసన్.!

Mon 17th Aug 2015 03:08 AM
telugu movie srimnanthudu,kamal appreciate srimanthudu movie,kamal haasan speakes about srimanthudu movie  దానికి కమల్ హాసన్.. దీనికి శృతిహాసన్.!
దానికి కమల్ హాసన్.. దీనికి శృతిహాసన్.!
Advertisement
Ads by CJ

గత వారం వరల్డ్‌వైడ్‌గా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'శ్రీమంతుడు' చిత్రాన్ని యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ చూశాడట. వెంటనే ఈ సినిమాపై కమల్‌ స్పందిస్తూ 'సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. చూస్తున్నంతసేపు నేను చాలా ఎంజాయ్‌ చేశాను. శృతి బాగా చేసింది. పాటల్లో డాన్సు కూడా బాగా చేసింది. మా అమ్మాయి కాబట్టి నేను ఈ మాటలు చెప్పడం లేదు. నిజంగానే చాలా బాగా చేసింది. ఎఎన్నార్‌గారు చేసిన 'శ్రీమంతుడు' చిత్రానికి నేను పనిచేశాను. ఈ 'శ్రీమంతుడు' చిత్రంలో మా అమ్మాయి నటించడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. సినిమా గురించి చెప్పాలంటే ఒక మంచి పాయింట్‌ని తీసుకొని దానికి అన్ని మసాలాలు అద్ది అందరికీ నచ్చే సినిమా తీశారు కొరటాల శివ. సబ్జెక్ట్‌ని చాలా అద్భుతంగా డీల్‌ చేశాడు. ఇక మహేష్‌బాబు గురించి చెప్పనక్కర్లేదు. చాలా బాగా చేశాడు. అతని నటనలో అన్ని ఎమోషన్స్‌ చాలా చక్కగా క్యారీ అయ్యాయి. ఈ నిర్మాతలకు ఇదే మొదటి సినిమా అని తెలిసింది. మొదటి సినిమాతోనే సూపర్‌హిట్‌ కొట్టిన నిర్మాతలకు నా కంగ్రాట్స్‌ తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు అందిస్తున్నాను' అన్నారు. 
కమల్‌హాసన్‌లాంటి లెజండరీ హీరో ఒక సినిమా చూసిన వెంటనే దాని గురించి స్పందిస్తూ మాట్లాడడం అతని గొప్ప తనానికి నిదర్శనం. కమల్‌గారిలాంటి గొప్ప నటుడు తమ సినిమాని చూసి ప్రశంసించడం, అందర్నీ పేరు పేరునా అభినందించడం మా అందరికీ చాలా సంతోషాన్ని కలిగించింది అని మహేష్‌ ఎంతో వినమ్రంగా చెప్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ