Advertisementt

'కేటుగాడు' సెన్సార్ పూర్తి!

Sat 15th Aug 2015 02:26 PM
ketugadu,kittu nalluri,venkatesh balasani,tejas,chandini  'కేటుగాడు' సెన్సార్ పూర్తి!
'కేటుగాడు' సెన్సార్ పూర్తి!
Advertisement
Ads by CJ

తేజస్‌, చాందిని జంటగా వి.ఎస్‌.పి. తెన్నేటి సమర్పణలో వెంకటేష్‌ మూవీస్‌, 100 క్రోర్స్‌ అకాడమీ పతాకాలపై కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేష్‌ బాలసాని నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘కేటుగాడు’. సాయికార్తీక్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా.. 

దర్శకుడు కిట్టు నల్లూరి మాట్లాడుతూ ‘‘నాపై అభిమానంతో సాయి కార్తిక్ మంచి మ్యూజిక్‌ అందించాడు. ఈ కథ చెప్పగానే దాన్ని నమ్మి సినిమా తియ్యడానికి ముందుకొచ్చిన నిర్మాతలు వెంకటేష్‌గారికి, వి.ఎస్‌.పి.తెన్నేటిగారికి థాంక్స్‌. రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రం ప్రివ్యూ చూసిన కె.ఎస్.రామారావు గారు బాగా ప్రమోట్ చేద్దామని చెప్పగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది" అని చెప్పారు.

నిర్మాత వెంకటేష్‌ బాలసాని మాట్లాడుతూ ‘‘మా బేనర్‌లో చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన టెక్నీషియన్స్‌ అంతా ఎంతో బాగా నన్ను సపోర్ట్‌ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. సాయికార్తీక్‌గారు చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. జోషి ఫోటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. 

సాయి కార్తీక్ మాట్లాడుతూ "అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ చిత్రమిది. తేజస్‌తో మంచి పరిచయం ఉంది. దర్శకుడు కిట్టు నన్ను అన్నయ్య అని పిలుస్తుంటాడు. నా సినిమాలా భావించి ఈ చిత్రానికి పనిచేశాను’’ అని అన్నారు.  

తేజస్ మాట్లాడుతూ "సాయికార్తీక్‌ నాకు మంచి స్నేహితుడు. మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. ఇటీవల విడుదలయిన చిత్ర ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఉలవచారు బిర్యాని తర్వాత చాలా కథలు నాదగ్గరికి వచ్చాయి. కానీ, అన్నీ ఒకేలా వున్నాయి. కిట్టు మంచి కథతో రావడంతో ఈ సినిమా స్టార్ట్‌ అయింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెప్టెంబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అని చెప్పారు.

తేజస్‌, చాందిని, సుమన్‌, రాజీవ్‌ కనకాల, సప్తగిరి, స్నిగ్ధ, భావన, చంద్రశేఖర్‌, అజయ్‌, పృథ్వి, ప్రవీణ్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, అదుర్స్‌ రఘు, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: మల్హర్‌భట్‌ జోషి, పాటలు: శ్రీమణి, కాసర్ల శ్యామ్‌, భాషాశ్రీ, బాలాజీ, బి.సుబ్బరాయశర్మ, మాటలు: పి.రాజశేఖరరెడ్డి, ఎడిటింగ్‌: పి.వెంకటేశ్వరరావు, భాషాశ్రీ, ఫైట్స్‌: నందు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అచ్చిబాబు ఎం., సంపత్‌కుమార్‌ ఎ., సమర్పణ: వి.ఎస్‌.పి.తెన్నేటి, నిర్మాత: వెంకటేష్‌ బాలసాని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిట్టు నల్లూరి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ