Advertisementt

శ్రీకాంత్ కి మరో 'ఖడ్గం' లాంటి సినిమా!

Sat 15th Aug 2015 05:33 AM
srikanth,terror movie,satheesh kasetti,nikitha  శ్రీకాంత్ కి మరో 'ఖడ్గం' లాంటి సినిమా!
శ్రీకాంత్ కి మరో 'ఖడ్గం' లాంటి సినిమా!
Advertisement
Ads by CJ

అఖండ భారత్‌ క్రియేషన్స్‌ పతాకంపై షేక్‌ కరీమా సమర్పణలో శ్రీకాంత్‌, నిఖిత హీరో హీరోయిన్‌లుగా సతీష్‌ కాసెట్టి దర్శకత్వంలో నిర్మాత షేక్‌ మస్తాన్‌ రూపొందించిన చిత్రం 'టెర్రర్‌'. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత షేక్‌ మస్తాన్‌ చిత్ర విశేషాలను తెలియజేస్తూ..'శ్రీకాంత్‌ ఓ సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం అందరికీ ఉత్కంఠతను కలిగిస్తుంది. 'ఖడ్గం' తర్వాత మా హీరో శ్రీకాంత్‌ పవర్‌ ఫుల్‌ అండ్‌ ఇంటిలిజెంట్‌ పోలీస్‌ పాత్రను ఈ చిత్రంలో చేశారు. శ్రీకాంత్‌గారి కెరియర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రమే కాకుండా మా సంస్థకు మంచి పేరు తెచ్చే చిత్రంగా ఈ చిత్రం రూపొందింది. ప్రతి సీన్‌ని దర్శకుడు సతీష్‌ కాసెట్టి అత్యద్భుతంగా తెరకెక్కించాడు. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసే అన్ని ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌ నుండి యు/ఎ సర్టిఫికెట్‌ని పొందిన మా 'టెర్రర్‌' చిత్రాన్ని ఈ నెలాఖరుకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..' అని అన్నారు. 
శ్రీకాంత్‌, నిఖిత, కోట శ్రీనివాసరావు, నాజర్‌, పృథ్వీ, వినయర్‌ వర్మ, ఉత్తేజ్‌, రవివర్మ, విజయ్‌చందర్‌, సుధ, ముజ్‌తబ జిఫర్‌, సంజయ్‌ రాయ్‌చూర్‌ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: షేక్‌ కరీమా, మాటలు: లక్ష్మీభూపాల్‌, ఎడిటర్‌: బసవ పైడిరెడ్డి, ఆర్ట్‌: మురళి కొండేటి, ఫైట్స్‌: రన్‌ జాఘవా, సినిమాటోగ్రఫీ: వాసిలి శ్యామ్‌ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌: షేక్‌ జైనులాబ్దీన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరి అయినీడి, నిర్మాత: షేక్‌ మస్తాన్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సతీష్‌ కాసెట్టి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ