Advertisementt

'శ్రీమంతుడు' కు యూనానిమస్ టాక్!

Wed 12th Aug 2015 10:48 AM
sreemanthudu,mahesh babu,koratala siva,sruthihassan  'శ్రీమంతుడు' కు యూనానిమస్ టాక్!
'శ్రీమంతుడు' కు యూనానిమస్ టాక్!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీమంతుడు. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌ పై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదలై మంచి సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..

దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ "సినిమా యూనానిమస్ టాక్ తో పెద్ద హిట్ అయింది. మొదటి రోజు నుండి అన్నీ వర్గాల ప్రేక్షకుల నుండి సక్సెస్ టాక్ సంపాదించుకుంది. సినిమా అనుకున్న దాని కంటే పెద్ద సక్సెస్ అయింది. ఈ విజయంలో అందరూ నటీనటులు, టెక్నిషియన్స్ పార్ట్ గా ఉన్నందుకు అందరికీ థాంక్స్. ఇటువంటి సినిమాని చేయడానికి అంగీకరించిన మహేష్ బాబుగారికి స్పెషల్ థాంక్స్. తమిళంలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడ నుండి దర్శకనిర్మాతలు ఫోన్స్ చేసి బావుందని చెప్పారు" అని చెప్పారు.

జగపతిబాబు మాట్లాడుతూ "మేము ఈ చిత్రాన్ని ఎంత ప్రేమించామో ప్రేక్షకులు అంతకంటే ఎక్కువగా ప్రేమించారు. ఫీల్ గుడ్ మూవీ ఇది. మహేష్ బాబు లాంటి నటుడితో కలిసి వర్క్ చేయడం సంతోషంగా అనిపించింది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్" అని చెప్పారు.

శ్రుతిహాసన్ మాట్లాడుతూ "ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. నాకు ఈ సినిమాలో నటించే అవకాసం ఇచ్చిన శివ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మహేష్ తో మొదటిసారి కలిసి వర్క్ చేసాను. వండర్ ఫుల్ యాక్టర్" అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ