Advertisementt

చిన్న సినిమాలకు గుడ్‌ బై చెప్పిన పెద్ద సంస్థ.!

Wed 12th Aug 2015 08:04 AM
yashraj films,yashraj films movies,producer aditya chopra  చిన్న సినిమాలకు గుడ్‌ బై చెప్పిన పెద్ద సంస్థ.!
చిన్న సినిమాలకు గుడ్‌ బై చెప్పిన పెద్ద సంస్థ.!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లోని చిత్ర నిర్మాణ సంస్థల్లో యష్‌రాజ్‌ ఫిలింస్‌కి ఓ ప్రత్యేక స్థానం వుంది. ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ ఈ సంస్థ సొంతం. కభీ కభీ, సిల్‌సిలా వంటి క్లాసిక్స్‌ నుంచి దిల్‌వాలే దుల్హనియా లేజాయెంగె, ధూమ్‌ సిరీస్‌, దిల్‌ తో పాగల్‌ హై వంటి ఆల్‌టైమ్‌ హిట్స్‌ వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ పెద్ద హీరోలతోనే పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా నిర్మిస్తూ విజయాలు సాధించింది. దాదాపు 70 చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ ఇప్పుడు అందర్నీ విస్మయ పరిచే ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ సంస్థ పెద్ద హీరోల సినిమాలు, పెద్ద బడ్జెట్‌ సినిమాలే తప్ప చిన్న సినిమాలు చేయకూడదని డిసైడ్‌ అయింది. ఈమధ్య ఈ సంస్థ నిర్మించిన కిల్‌దిల్‌, డిటెక్టివ్‌ బ్యోమ్‌కేష్‌ బక్షీ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. దీంతో యష్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, హృతిక్‌రోషన్‌లతో మూడు సినిమాలు చేస్తున్న ఈ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని చిన్న హీరోలు, దర్శకులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ