మహానటుడు అక్కినేని మనవడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో యూత్‌స్టార్ నితిన్ నిర్మిస్తున్న భారీ చిత్రం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
భారీ సెట్‌లో క్లైమాక్స్!
ఆగస్ట్ 11 నుండి ఈ చిత్రం కోసం హైదరాబాద్ సంఘీ ఫారెస్ట్‌లో కోట్లాది రూపాయల వ్యయంతో వేసిన భారీ సెట్‌లో క్లైమాక్స్ చిత్రీకరణ ఫైట్‌మాస్టర్ రవివర్మ సారధ్యంలో పెద్ద ఎత్తున చిత్రీకరించడం స్టార్ట్ చేశారు. ఈనెల 23 వరకు ఈ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. దీనితో 3 పాటలు మినహా చిత్రం పూర్తవుతుంది.
యూరప్‌లో పాటలు!
నిర్మాత నితిన్ మాట్లాడుతూ - ''ఆగస్ట్ 30 నుండి సెప్టెంబర్ 12 వరకు యూరప్‌లో రెండు పాటలు చిత్రీకరిస్తాం. సెప్టెంబర్ 18 నుండి 23 వరకు హైదరాబాద్‌లో భారీ సెట్స్‌లో చివరి పాట చిత్రీకరించడంతో షూటింగ్ టోటల్‌గా ఫినిష్ అయింది'' అన్నారు.
నాగార్జున బర్త్‌డేకి ఫస్ట్ లుక్
అక్కినేని జయంతికి ఆడియో!
ఆగస్ట్ 29 నాగార్జునగారి బర్త్‌డేకి ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేస్తాం. అలాగే అక్కినేని నాగేశ్వరరావుగారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20న భారీ ఎత్తున ఆడియోను ఆవిష్కరిస్తాం. అక్టోబర్ 21న వరల్డ్‌వైడ్‌గా విజయదశమి కానుకగా చాలా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం అని చెప్పారు నితిన్.
ఇది నా అదృష్టం - సయేషా
హీరోయిన్ సయేషా మాట్లాడుతూ - ''ఆగస్ట్ 12 నా బర్త్‌డే. ఇంత పెద్ద బేనర్‌లో సినిమా చెయ్యడం, ఇంత భారీ చిత్రం షూటింగ్‌లో వుండడం నాకు నిజంగా హ్యాపీ బర్త్‌డే. అఖిల్ లాంచింగ్ ఫిలిమ్‌లో హీరోయిన్‌గా నటించే గొప్ప అవకాశం ఇచ్చిన వినాయక్‌గారికి, నితిన్‌గారికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రం చాలా పెద్ద హిట్ నా కెరీర్‌కి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. అఖిల్‌తో నటించడం చాలా హ్యాపీగా వుంది'' అని చెప్పారు.
బిజినెస్ క్రేజ్!
సమర్పకురాలు నిఖితా రెడ్డి మాట్లాడుతూ - ''అఖిల్ ఎక్స్‌ట్రార్డినరీగా చేస్తున్నాడు. వినాయక్‌గారు ఎక్స్‌లెంట్‌గా తీస్తున్నారు. మా బేనర్‌కి ఇది ప్రెస్టీజియస్ ఫిలిమ్ అవుతుంది. బిజినెస్‌పరంగా ఈ చిత్రానికి చాలా పెద్ద క్రేజ్ వచ్చింది. బయ్యర్లందరూ ఈ సినిమా కోసం పోటీలు పడడం విశేషం. అక్టోబర్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.
అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతోపాటు లండన్‌కు చెందిన లెబాగా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్‌గా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతంరాజు, భాస్కరభట్ల, కృష్ణచైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు.
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితారెడ్డి, నిర్మాత: నితిన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.